శుభసూచకం: రాహుల్ గాంధీపై యుపి సిఎం యోగి కామెంట్
అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు
రాహుల్ గాంధీ కాంగ్రెసు అధ్యక్షుడు కావడం బిజెపికి శుభసూచకమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అతి ముఖ్యమైన బిజెపి ముఖ్య నాయకుల్లో యోగి కూడా ఒక్కరు.

రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శించడంపై ఆయన ఎన్నికల ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయంలో ఎలా కూర్చోవాలో కూడా రాహుల్ గాంధీకి తెలియదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ప్రజలను మత ప్రాతిపదికపై విభజించాలని కాంగ్రెసు ప్రత్నించిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications