కాల్పుల విరమణ వేళ ప్రధానికి రాహుల్ అనూహ్య డిమాండ్..!!
ఆపరేషన్ సింధూర్ కు రాజకీయంగా అన్ని పార్టీలు కేంద్రానికి మద్దతుగా నిలిచాయి. ఉగ్రవాద శిబిరాల పైన దాడులను సమర్థించాయి. పాక్ పైన తీసుకునే చర్యలకు పూర్తి మద్దతుగా నిలుస్తామ ని హామీ ఇచ్చాయి. కాగా, అమెరికా జోక్యంతో భారత్ - పాక్ కాల్పుల విరమణకు అంగీకారం తెలి పాయి. ట్రంప్ తాము రెండు దేశాలను ఒప్పించినట్లు వెల్లడించారు. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే భారత్ -పాక్ సైతం కాల్పుల విరమణకు అంగీకరంచినట్లు వెల్లడించాయి. మోదీ నిర్ణయం పైన మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ఖర్గే కీలక డిమాండ్ తో ప్రధాని మోదీకి లేఖ రాసారు.
భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. నిర్ణయం తరువాత కొద్ది గంటలకే పాక్ సేనలు కాల్పులకు దిగటంతో భారత్ ధీటుగా స్పందించింది. ఆ తరువాత పాక్ నుంచి కాల్పుల విరమణ కొనసాగుతోంది. దీంతో, సరిహద్దు ప్రాంతాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్నినిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , మల్లి ఖార్జున ఖర్గే ప్రధాని మోదికి లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్ తో పాటుగా పాక్ తో తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పూర్తి మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసారు. కాగా, ఈ లేఖలో రాహుల్ కీలక అంశాలను ప్రస్తావించారు.

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూ ర్, కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా దీనిపై ప్రకటన చెయ్యడం వంటి అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం మనముందున్న సవాళ్లను ఎదుర్కోడానికి, సమిష్టి సంకల్పాన్సి ప్రదర్శించడానికి ఈ సమావేశం ఒక అవకాశంగా రాహుల్ పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత్ శక్తి చాటామని వెల్లడిస్తున్నారు. సరిహద్దుల్లోనే కాకుండా పాక్ సైనిక స్థావరాలు ఉన్న రావల్పిండిలోని పాక్ సైన్యం స్థావరాలను ధ్వంసం చేసినట్లు మంత్రి రాజ్ నాధ్ చెప్పుకొచ్చారు. దీంతో, ఆపరేషన్ సింధూర్ ప్రారంభం నుంచి కాల్పుల విరమణ వరకు చోటు చేసుకున్న పరిణామాల పై చర్చ కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ ఏర్పాటు చేయాలనే రాహల్ డిమాండ్ పైన కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications