విపక్షాల కూటమిలోకి బీఆర్ఎస్: నితీశ్ కు రాహుల్ బాధ్యతలు..!?
జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాల ఐక్యత దిశగా కీలక అడుగు పడింది. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలని రాహుల్ నాయకత్వంలో విపక్షాల నేతలు నిర్ణయించారు. ఇందు కోసం అన్ని పార్టీలను కలుపుకుపోవాలని డిసైడ్ అయ్యారు. బీజేపీని వ్యతిరేకిస్తూ..అదే సమయంలో కాంగ్రెస్ తోనూ దూరం పాటిస్తున్న పార్టీలను కలుపుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఆప్..టీఎంసీతో పాటుగా బీఆర్ఎస్ ను కలుపుకొని వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ తో మాట్లాడే బాధ్యతను నితీశ్ తీసుకున్నారు.
విపక్షాల కూటమి దిశగా:బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి దిశగా రాహుల్ - నితీశ్ కార్యాచరణ ప్రారంభించారు., అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే..రాహుల్ గాంధీ..బీహార్ సీఎం నితీశ్..తేజస్వీ యాదవ్ తో సహా పలువురు పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా వెళ్లాల్సిన అవసరం పైన చర్చించారు. విపక్షాలు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్,ఆ పార్టీ ఎంపీ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. డీఎంకే, ఎన్సీపీతో కాంగ్రెస్ నేతలు చర్చించాలని డిసైడ్ అయ్యారు. తమ సమావేశం చరిత్రాత్మకమైనది అని, విపక్షాలను ఐక్యం చేసేందుకే తాము చరిత్రాత్మక అడుగు వేశామని రాహుల్ - నితీశ్ వెల్లడించారు.

టార్గెట్ బీజేపీ - కీలక అడుగు:ఈ సమావేశానికి ముందు ఖర్గే డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించారు. సాధ్యమైనన్ని పార్టీలను సంఘటితం చేసి కలిసికట్టుగా పనిచేయాలన్నదే తమ ప్రయత్నమని నితీశ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో ఎన్నో సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని. జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలందరినీ సంఘటితం చేయడమే తమ లక్ష్యమని ఖర్గే ప్రకటించారు. టీఎంసీ, ఆప్, బీఆర్‌ఎస్ తదితరపార్టీల అధినేతలతో నితీశ్ కుమార్ చర్చించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చల్లో విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడితే మొత్తం విపక్ష నేతలందరితో సమావేశమై బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహం రూపొందించాలని నిర్ణయించారు.
కేసీఆర్ ను ఒప్పించే బాధ్యత నితీశ్ కు:ఆదానీ పైన తాజాగా పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలపై జరిగిన పోరాటంలో దాదాపుగా అన్ని విపక్షాలు ఏకమయ్యాయి. అయితే, కాంగ్రెస్ తో పూర్తిగా సహకరించేందుకు ఆప్, టీఎంసీ, బీఆర్ఎస్ సుముఖంగా లేవు. ఈ సమయంలో ఈ పార్టీల అధినేతలతో మాట్లాడి వారు కలిసి ఒప్పించేలా చేసే బాధ్యతను నితీశ్ కు అప్పగించారు. కేజ్రీవాల్ ,మమత, కేసీఆర్ తో నితీశ్ ఇదే అంశం పైన చర్చలు చేయనున్నారు. విపక్షాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశంసించారు. ఈ విషయంలో ఆయనకు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా..కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దంగా లేదు. బీజేపీ పై పోరాటంలో మాత్రం మద్దతు ఇస్తోంది. నితీశ్ - కేసీఆర్ చర్చల్లో దీని పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications