వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ విభజన: ఒక వైపే చూస్తున్నారెందుకు?: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు గల స్వయం ప్రతిపత్తి రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు. కేంద్ర తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్ ను విభజించడం వల్ల సంభవించే దుష్పరిణామాలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేయలేకపోతోందని విమర్శించారు.

ఈ అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రబుత్వం ఒక వైపు మాత్రమే చూస్తోందని, రెండో వైపు చూడటానికి సాహసించట్లేదని అన్నారు. జమ్ముకాశ్మీర్‌ను విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో సమస్య చల్లారుతుందని బీజేపీ భావిస్తోందని అన్నారు. దేశ సమగ్రతను కాపాడామని, అఖండ భారతావనిని సాధించినట్లు చెప్పుకొంటోందని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.

Rahul Gandhi Breaks Silence on Article 370 Row

అనాలోచింతంగా జమ్ముకాశ్మీర్ ను విభజించిందని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. దేశమంటే భూములు అమ్ముకోవడం, ప్లాట్లు వేసుకోవడం మాత్రమే కాదని హితవు పలికారు. దేశం అంటే ప్రజలు అనే విషయాన్ని బీజేపీ విస్మరించిందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంభవించే దుష్పరిణామాలపై సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అన్నారు.

<strong>జమ్మూ కాశ్మీర్, లడక్..రెండూ కేంద్ర పాలిత ప్రాంతాలే: అయినా..!</strong>జమ్మూ కాశ్మీర్, లడక్..రెండూ కేంద్ర పాలిత ప్రాంతాలే: అయినా..!

ఈ నిర్ణయం వల్ల మన జాతీయ భద్రతకు తీవ్రమైన చిక్కులు ఏర్పడతాయని అన్నారు. దేశం ప్రజల సమైక్యతతో ఏర్పడిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌ను రెండుగా విడదీయడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను గృహ నిర్బంధంలో ఉంచడం, జైలుకు తరలించడమేనా అని నిలదీశారు.

English summary
Senior Congress leader Rahul Gandhi on Tuesday broke his silence on the revocation of special status to Jammu & Kashmir by the central government. The "unilateral move", the Gandhi scion said, would further create resentment in the Valley and pose implication for the national security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X