నాదే బాధ్యత: మోడీ విన్‌పై రాహుల్, సోనియా గ్రీటింగ్స్

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు శుక్రవారం స్పందించారు. ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఓటమికి తనదే బాధ్యత అన్నారు. గెలుపొందిన బిజెపికి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి తన అభినందనలు అన్నారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు అన్నారు.

కాంగ్రెసు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ అని సోనియా గాంధీ చెప్పారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమేనని చెప్పారు. తాము ప్రజాతీర్పును శిరసా వహిస్తామన్నారు. కొత్త ప్రభుత్వానికి తాను అభినందనలు చెబుతున్నట్లు చెప్పారు.

Sonia Gandhi

మోడీ సెల్ఫీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. గుజరాత్‌లోని వడోదర, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి రెండు నియోజకవర్గాల్లోను మోడీ విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో మోడీ ఇది భారత దేశం విజయం అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భారత్ గెలిచిందని, ఇది భారత దేశం విజయమని, మంచి రోజులు త్వరలోనే రానున్నాయని ట్వీట్ చేశారు. విజయం సాధించాక మోడీ తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఆశీర్వాదం తీసుకుంటున్న సెల్ఫీపై తన సంతకంతో సహా మోడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+