ఓటర్ జాబితాలో బ్రెజిలియన్ మోడల్: కొత్త బాంబు పేల్చిన రాహుల్!

Rahul Gandhi: : ఎన్నికలలో జరిగిన అవకతవకలు, ఓట్ల చోరీ అంశంపై ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌గాంధీ 'హెచ్-ఫైల్స్ (H-Files)' పేరుతో కొత్త బాంబు పేల్చారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల మోసం జరిగిందని.. మొత్తం 2 కోట్ల ఓటర్లు ఉండగా.. 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని ఆయన ఆరోపించారు. అంటే హర్యానాలోని ప్రతి 8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని ఆయన వివరించారు.

అన్ని ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేసినా.. ఫలితాల్లో బీజేపీ గెలిచిందని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపణలు చేశారు. ఫలితాలు రాకముందే బీజేపీ నేత, సీఎం నాయబ్ సింగ్ సైనీ ఏర్పాట్లు జరిగాయని.. బీజేపీ గెలుస్తుందని నవ్వుతూ మీడియాకు చెప్పిన వీడియోను రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ఈ ఏర్పాట్లు ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. హర్యానా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ పోలింగ్ బూత్‌ల ఫలితానికి వ్యతిరేకంగా వచ్చిందని అన్నారు. కేవలం 22,779 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయిందని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్లాన్ అని అన్నారు.

Rahul Gandhi Exposes Brazilian Model Fake Voting H-Files Bombshell

బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో మోసం.. 22 చోట్ల ఒకే ఫోటో
ఓట్ల మోసానికి సంబంధించి రాహుల్ గాంధీ ఓ ఉదాహరణను ఉదహరించారు. హర్యానా ఓటర్ల జాబితాలో ఒక మహిళ ఫోటో 22 ఎంట్రీలలో కనిపించింది. ఆ ఫోటో ఒక బ్రెజిలియన్ మోడల్‌ది అని, అది ఉచితంగా లభించే స్టాక్ ఫోటో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేయబడినదని ఆయన వివరించారు. ఆ మహిళ ఫోటో స్వీటీ, సీమా, సరస్వతి వంటి వివిధ పేర్లతో 10 వేర్వేరు బూత్‌లలో కనిపించిందని రాహుల్ గాంధీ ఫోటోలు, పేర్లతో సహా ప్రదర్శించారు. మరొక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే మహిళ ఫోటోతో 100 ఓటరు ఐడీలు ఉన్నాయని.. దీని వల్ల బీజేపీ మద్దతుదారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేయడానికి వీలు కలుగుతుందని ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ, ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించాయి.

ఎన్నికల సంఘం కౌంటర్
రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమని.. అవన్నీ అవాస్తవమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా ఓట్లను తొలగించడం అసాధ్యమని స్పష్టం చేసింది. పోలింగ్ రోజున కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారని ఈసీ వర్గాలు ప్రశ్నించాయి. ఓటరు గుర్తింపుపై అనుమానం ఉంటే లేదా ఓటు వేసి ఉంటే వెంటనే అభ్యంతరం చెప్పాల్సిన బాధ్యత ఏజెంట్లకు ఉంటుందని తెలిపాయి. నకిలీ ఓటర్లందరూ బీజేపీకే ఓటు వేశారని రాహుల్ గాంధీ ఎలా చెప్పగలరని ఈసీ ప్రశ్నించింది.

బీజేపీ కౌంటర్ అటాక్..
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే వారు ఎన్నికల సంఘాన్ని లేదా కోర్టులను ఆశ్రయించవచ్చని అన్నారు. తమ వైఫల్యాలకు కాంగ్రెస్ ఎప్పుడూ ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని నిందిస్తుందని, వారికి వ్యవస్థపై నమ్మకం లేదని ఆయన విమర్శించారు. మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వంటి నాయకులు కూడా రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+