పార్టీ కార్యకర్తలు సహాయం చెయ్యండి, అందరిని ఆదుకోండి, అమిత్ షా, రాహుల్ గాంధీ, ఖార్గే మనవి !

మిగ్ జాం తుపాను వరదల్లో మరణించిన మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మిగ్ జాం తుపాను ప్రభావిత రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుపాను చెన్నై సిటీతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.

మిగ్ జాం తుపాను చెన్నై సమీపంలో 30 గంటల పాటు కొనసాగడంతో చెన్నై సిటీతో సహా తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగ్ జాం తపాను 48 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షాన్ని కురిపించింది. దీంతో తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాలు భారీ వానల దెబ్బకు ఆ పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Rahul Gandhi expressed his condolences to the families of those who lost their lives in the Michaung cyclone

చెన్నై నగరం, చెన్నై సిటీ శివారు ప్రాంతాలు భారీగా జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మిగ్ జాం తుపాను కారణంగా తమిళనాడులో చాలా మంది చనిపోయారు. మిగ్ జాం తుపాను ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ పనులు, రిలీఫ్ పనుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు, రాయలసీమకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే మిగ్ జాం తుపాను సహాయక చర్యల్లో పాల్లొనాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిసింది.

Rahul Gandhi expressed his condolences to the families of those who lost their lives in the Michaung cyclone

కేంద్ర హోమ్ శాఖా అమిత్ షా సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఫోన్ లో సంప్రదించి చెన్నై సిటీలోని వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని అమిత్ షా మనవి చేశారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కాంగ్రెస్ పాలుపంచుకోవాలని సూచించారు. చెన్నై సిటీలో పలు స్వచ్చంద సంస్థలు కార్పోరేషన్ అధికారులు, సిబ్బందికి సహాయం చేస్తూ వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+