రాజీవ్ హంతకుల్ని క్షమిస్తానని రాహుల్ అనడం అనుమానం కలిగిస్తోంది: స్వామి
న్యూఢిల్లీ: తన తండ్రి రాజీవ్ గాంధీని చంపిన హంతకులను తాము క్షమిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో రాజీవ్ గాంధీ హత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్వామి స్పందించారు.
సుపారీ హత్య లేదా పథకం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశ్యంతో రాజీవ్ గాంధీని చంపించినట్లుగా అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.

రాజీవ్ హత్యపై దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ హంతకులను క్షమిస్తున్నట్లు రాహుల్ చెప్పడం దేశభక్తి లేకపోవడానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
రాజీవ్ అచ్చమైన జాతీయవాది అని, ఆయన హత్యకు బాధ్యులైన వారికి విధేయత లేదన్నారు. అలాంటి వారి పట్ల సానుకూలత చూపించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications