ప్రధాని మోదీ ఆత్మరక్షణ ధోరణి: దూసుకెళ్తున్న రాహుల్

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సరిగ్గా ఐదేళ్ల క్రితం 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం.. 2014లో సార్వత్రిక ఎన్నికలకు దిశా నిర్దేశంచేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతకుముందు 2002 నుంచి మూడు సార్లు సొంత రాష్ట్రం గుజరాత్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దీంతో బీజేపీ అధి నాయకత్వం.. 2013 సెప్టెంబర్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికచేసింది.

అప్పటికే పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరిగా ఎల్ కే అద్వానీ కూడా మోదీ ఎదుగుదలపై ఆగ్రహించారు కూడా. కానీ చరిత్ర మరో కోణంలో ముందుకు దూసుకుపోయింది. మరోసారి వచ్చే డిసెంబర్ నెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ భవిష్యత్‌ను, 2019 లోక్‌సభ ఎన్నికలను నిర్దేశించనున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ నేతలే కావడంతో తేలిగ్గా ఈ రాష్ట్రంలో గెలుచుకోవచ్చునని ఊహించొచ్చు. కానీ బీజేపీ విజయం ఊహించలేకపోతున్నది.

గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. గత జూన్ నుంచి పరిస్థితులు మారిపోయాయి. అధికార బీజేపీలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మినహా చెప్పుకోదగిన ప్రముఖ నాయకుడే లేరు. ఇదే పరిస్థితి కాంగ్రెస్ ముందు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్ మినహా ప్రముఖ నేతలు లేకపోవడం ఆ పార్టీకి కూడా ఇబ్బందికరమే.

 ఉత్సాహంగా రాహుల్ ముందడుగు

ఉత్సాహంగా రాహుల్ ముందడుగు

దేవాంశ సంభూతుడిగా ప్రధాని మోదీ విజయ సంకేతాలు తగ్గుముఖం పట్టాయి. ఆయన మోములో ఆందోళన స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆయన భాష ఆత్మరక్షణ ధోరణిని తెలియజేస్తోంది. ఆయనలోని ఆడంబరం, విశ్వాసం తప్పిపోయింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడుగులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. ఆయన రోజురోజుకు శక్తిమంతంగా కనిపిస్తూ మరింత సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఇక ఆయనపై జోక్‌లు వేసే అవకాశాలు కనిపించట్లేదు. జాతీయ రాజకీయాల్లో ఆయనను ‘పప్పు' అని ఎగతాళి చేస్తుండే వారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షణ శక్తి పెంచుకోవడం ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆందోళనకు గురి చేస్తోంది.

 ఇలా తగ్గిన కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ

ఇలా తగ్గిన కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ

2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించింది. నాడు అధికార కాంగ్రెస్ పార్టీగా పలు కుంభకోణాలు ఎదుర్కొంటున్నది. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షోభాల్లో చిక్కుకుని పోయింది. దాని ప్రజాదరణ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. తద్వారా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని సాగనంపేందుకు మార్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో దారుణ ఓటమిని చవి చూసిన బీజేపీని గట్టెక్కించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) బాధ్యతలు స్వీకరించింది. సమీకరణాలు మారిపోయాయి.

 మూడేళ్లలో పరిస్థితులు తారుమారు

మూడేళ్లలో పరిస్థితులు తారుమారు

2014లో కాంగ్రెస్ పార్టీ నైతిక స్థైర్యాన్ని కోల్పోయి ఉన్నది. నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ పూర్తిగా అమలు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ప్రజల ముందు నిలిచింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయి, అందుకు విరుద్ధంగా మారాయి. భారీ వాగ్దానాలు చేసి అమలు చేయడంలో విఫలమైంది. క్రితం సారితో పోలిస్తే ప్రజా వ్యతిరేకతను రెట్టింపు చేసుకున్నదన్న విమర్శలు ఉన్నాయి.

 మోదీని జాతీయ స్థాయికి పంపిన గుజరాత్

మోదీని జాతీయ స్థాయికి పంపిన గుజరాత్

2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోదీకి పట్టం గట్టి సీఎంగా ఎన్నుకున్నారు. ఆయన తప్పిదాలెలా ఉన్నా మోదీకి గుజరాత్ జాతీయ గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆయన గుజరాత్ అభివ్రుద్ధి మోడల్ నినాదాన్ని విజయవంతంగా ముందుకు తెచ్చారు. ఆయన సంపన్నులు, పట్టణ మధ్య తరగతి ప్రజలకు ప్రియమైన వ్యక్తిగా నిలిచారు. పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశాలు కల్పించగల ఆశాకిరణం. ఈనాడు ప్రధానిగా నరేంద్రమోదీ.. ఒక రాష్ట్ర సీఎంగా వెనుకకు రాలేరు. కానీ ఆయన వారసురాలిగా ఆనందీబెన్ పటేల్ మొండి పట్టుదలకు పోయేవారని, పాటిదార్ల ఆందోళన తర్వాత సీఎంగా అధికారం చేపట్టిన విజయ్ రూపానీ మంచి పేరు ఉన్నా తానుగా నిలదొక్కుకోలేకపోయారు. తిరిగి గుజరాతీలు విజయ్ రూపానీని ఎలా ఎన్నుకుంటారన్నది చూడాల్సిందే.

 కొద్ది మందికే మోదీ హయాంలో లబ్ది

కొద్ది మందికే మోదీ హయాంలో లబ్ది

గత ఐదేళ్లలో పదేపదే చెప్తున్న ఆర్థికాభివ్రుద్ధి మోడల్ విధానాలు ప్రజల ఆకాంక్షల నెరవేర్చడంలో విఫలం అయ్యారు. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ హామీలకు..సంత్రుప్తి మధ్య చాలా తేడా, అంతరాయం ఉన్నది. ప్రభుత్వ విధానాల వల్ల కొన్ని శక్తులు మాత్రమే లబ్ధి పొందాయి. తమ ఆకాంక్షలు నెరవేరుస్తామని భావించిన పాటిదార్ల ఆశలు అడియాసలు అయ్యాయి. రాష్ట్ర జనాభాలో 14 శాతంగా ఉన్న పాటిదార్లు.. రాజకీయంగా, ఆర్థికంగా ఆధిపత్య స్థాయి కలిగి ఉన్నారు. పలుకుబడి గల సామాజిక వర్గం పాటిదార్లు ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరవేశారు. కొందరు పాటిదార్లు మాత్రం లబ్ది పొందారు. రాజకీయంగా ఎదిగారు. కానీ భారీస్థాయిలో పటేళ్లు ఉపాధి లేక అల్లాడుతూ, ఓబీసీలుగా రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన బాట పట్టారు. 22 ఏళ్ల హార్దిక్ పటేల్ వారికి ఆశా కిరణంగా మారారు. విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుపొందేందుకు ఆయన మద్దతు కీలకం కానున్నది.

 అలవోకగా బ్రాండ్ మద్యం లభ్యం

అలవోకగా బ్రాండ్ మద్యం లభ్యం

గుజరాత్‌లో మద్యనిషేధం ఒక బూటకంగా మిగిలింది. అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ప్రతి బ్రాండ్ మద్యం అలవోకగా లభిస్తోంది. గ్రామీణ గుజరాత్ భగ్గుమంటోంది. ఒక ఊరి తర్వాత మరో ఊరు కుప్పకూలుతున్నది. గ్రామాల్లో అత్యధికులు క్షత్రియులు బాగా నష్టపోయారు. తాగునీటి కోసం అల్లాడుతున్న తరుణంలో క్షత్రియుల యువ నాయకుడిగా అల్పేశ్ ఠాకూర్ చేపట్టిన ఉద్యమం ఆయనకు భారీగా మద్దతుదారులను తెచ్చి పెట్టింది. బీజేపీని విభేదిస్తున్న పాటిదార్లకు తోడు కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ మద్దతు దారులైన క్షత్రియులు ‘హస్తం' బలోపేతానికి కారణమవుతారని చెప్తున్నారు.

 జీఎస్టీతో బీజేపీకి దూరమైన వ్యాపారులు

జీఎస్టీతో బీజేపీకి దూరమైన వ్యాపారులు

గతేడాది జూలైలో ఉనాలో దళితులపై దాడి తర్వాత దళితుల్లో చైతన్యం తీసుకొచ్చారు. అన్ని ప్రాంతాల్లో దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ మేవానీ సారథ్యంలో ఉద్యమిస్తున్నారు. అనునిత్యం చురుగ్గా ప్రతిస్పందించే ముగ్గురు యంగ్ టర్కుల సారథ్యంలో కీలక సమయంలో పలువురు తటస్థ ఓటర్ల మనోభావాలను మార్చేస్తారని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభించిన జీఎస్టీ కూడా సూరత్‌లోని వ్యాపార వర్గాలను బీజేపీకి దూరం చేసింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యాపారులు భారీ ప్రదర్శనలు చేపట్టారు. కమలనాథులకు వ్యతిరేకంగా రణన్నినాదం చేస్తున్నారు.

 రెండేళ్లక్రితం స్థానిక ఎన్నికల్లో తగ్గిన బీజేపీ ఆధిక్యం

రెండేళ్లక్రితం స్థానిక ఎన్నికల్లో తగ్గిన బీజేపీ ఆధిక్యం

2002 నుంచి కాంగ్రెస్ పార్టీ నిరంతరం 39 శాతం ఓట్లు పొందుతూనే ఉన్నది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో మరో తొమ్మిది శాతం ఓట్లు పొందింది. కానీ 2015లో గుజరాతీలు భిన్నమైన తీర్పునిచ్చారు. నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24 పంచాయతీలను 48 శాతం ఓట్లతో గెలుచుకోగా, బీజేపీ 44 శాతం ఓట్లతో ఆరు పంచాయతీలకు పరిమితమైంది. తాలూకా పంచాయతీ ఎన్నికల్లో 46 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 134, బీజేపీ 42 శాతం ఓట్లతో 67 తాలూకాలను గెలుచుకున్నది. 2010 మున్సిపల్ ఎన్నికల్లో 18 శాతం లీడింగ్‌లో ఉంది. కానీ 2015 నాటికి అది ఐదు శాతానికి పడిపోయింది. అలాగే గుజరాత్ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఎనిమిది శాతానికి తగ్గించి వేసింది. 2010లో 52 శాతం ఓట్లు బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 33% ఓట్లు పొందింది. కానీ 2015లో బీజేపీ 50%, కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓట్లు పెంచుకున్నది.

 ప్రజలను ఆలోచింపజేస్తున్న నోట్లరద్దు, జీఎస్టీ

ప్రజలను ఆలోచింపజేస్తున్న నోట్లరద్దు, జీఎస్టీ

2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి హెచ్చరికగా మిగిలాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు చాలా తేడా ఉన్నది. 2015 నుంచి కానీ ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత కనిపిస్తున్నది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ప్రజలు కొత్త మార్గంలో ఆలోచించేలా చేసింది. 2012 ఎన్నికలు మోదీ ఆయన్ను ప్రధానిగా గెలిపిస్తే, వచ్చే డిసెంబర్ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమోదయోగ్యంగా బీజేపీ విజయం సాధిస్తే 2019లోనూ గెలుపొందడం తేలిక అని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ అప్పుడు ఇప్పుడు గుజరాతీల వెన్నంటి ఉన్నా మోదీలో నిరాశావాదం కనిపిస్తున్నదని చెప్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It was the result of the Gujarat election in 2012 which set the tone for the general election of 2014. After winning three consecutive elections in his home state, Narendra Modi claimed the leadership position in the BJP and finally emerged as its prime ministerial candidate at a Goa conclave in September, 2013. The tallest leader of BJP at that time, LK Advani, had resented Modi's rise and eminence in the party, but he was ignored and history moved on a different tangent.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి