మోదీపై రాహుల్ టీం గెలుపు వెనుక, ఆ ఒక్క 'మెసేజ్' లెక్క మార్చేసింది..!!

మోదీ ప్రభుత్వం పై విపక్షం విజయం సాధించింది. రాహుల్ సారధ్యంలో పార్లమెంట్ వేదికగా మోదీ ప్రభుత్వానికి విపక్షాలు షాక్ ఇచ్చాయి. తిరుగులేని విధంగా ముందుకు వెళ్తున్న మోదీ టీం కు తొలి భంగపాటు ఎదురైంది. రాజ్యంగ సవరణ బిల్లుకు తమ మద్దతు అవసరమని గుర్తించిన రాహుల్ క్యాంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీ గేమ్ ప్లాన్ ను ధీటుగా ఎదుర్కొంది. పక్కా ప్రణాళికా బద్దంగా వెళ్తూ.. చివరకు మోదీ సర్కార్ ఆశల పై నీళ్లు చల్లింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో రాహుల్ వ్యవహరించిన తీరు ఆసక్తిగా మారింది.

పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ తన కూటమిని ఐక్యంగా నడిపారు. బీజేపీ ట్రాప్ లో పడకుండా అందరినీ ఏకతాటి పైకి తెచ్చారు. ఫలితంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడి పెట్టి డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రయత్నించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ కల్పించేందుకు, 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్లను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు 68 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఈ బిల్లులను ఆమోదించే విషయంలో ప్రతిపక్షాలను ఒప్పించేందుకు చివరి వరకూ మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. అందులో మూడింట రెండువంతుల మెజారిటీ రావాలంటే 352 ఓట్లు అవసరం కాగా.. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావడంతో బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.

మోదీ- షా లెక్క తప్పింది అక్కడే, భంగపాటు దిద్దుబాట: అనూహ్య నిర్ణయం..!!
మోదీ- షా లెక్క తప్పింది అక్కడే, భంగపాటు దిద్దుబాట: అనూహ్య నిర్ణయం..!!
rahul-gandhi-hails-defeat-of-womens-reservation-bill-says-india-has-seen-it-india-has-stopped-it

ఐక్యత చాటిన విపక్ష కూటమి

దీనితో రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లులను కూడా ఉపసంహరించు కుంటున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్లను మద్దతు ఇస్తున్నామని చెబుతూనే.. డీలిమిటేషన్ తీరును తప్పుబట్టారు. డీలిమిటేషన్ తీరు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో.. ఒక సమయంలో అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం మేర సీట్ల పెంపు విషయాన్ని బిల్లులో చేరుస్తామని అమిత్ షా ప్రకటించారు. అయినా.. విపక్షం వెనక్కు తగ్గలేదు. ఈ బిల్లుకు ఆమోదిస్తే.. డీ లిమిటేషన్ పూర్తి చేస్తారని.. ఇక బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకే ఈ బిల్లు తెచ్చిందని మిత్రపక్షాలకు పదే పదే చెప్పటంతో వారంగా ఏకం కాక తప్పలేదు. ఈ తరహా డీలిమిటేషన్ జరిగితే తమ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అవుతందని ఇండియా కూటమి సమావేశాల్లో రాహుల్ ప్రత్యేకంగా వివరించారు. దీంతో.. మిత్రపక్షాలన్నీ పాత విషయాలను పక్కన పెట్టి.. ఈ విషయంలో ఐక్యం అయ్యాయి. ఫలితంగా మోదీ టీం పైన పై చేయి సాధించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+