పప్పూ కాదు కానీ: రాహుల్ గాంధీపై ముక్తార్ అబ్బాస్ నక్వీ సెటైర్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ సెటైర్లు వేశారు. ఆయన పప్పు నుంచి గప్పుగా మారాడని ఎద్దేవా చేశారు. నేరుగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా, పరోక్షంగా మండిపడ్డారు.

పప్పుగా ఉన్న ఓ వ్యక్తి ఇప్పుడు గప్పు(గాసిప్స్ మాట్లాడేవాడు)గా మారారని అన్నారు. రాఫెల్‌ ఒప్పందంపై రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలపై నఖ్వీ స్పందిస్తూ పైవిధంగా అన్నారు. రాఫెల్‌ గురించి సదరు వ్యక్తి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.

Rahul Gandhi Has Gone From Pappu To Gappu Through Lies: BJP

ఇన్నాళ్లూ పప్పుగా ఉన్న ఓ వ్యక్తి ఇప్పుడు గప్పు అయ్యారని, నిజాలను అబద్ధాలని అనుకుంటున్నారని, ఆ వ్యక్తి సాధారణంగానే అవివేకంగా, లాజిక్‌ లేకుండా మాట్లాడతారని, ఇప్పుడు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, దేశ అభివృద్ధి, పురోగతి, మంచి ప్రభుత్వ పాలనను వాళ్లు గుర్తించలేరన్నారు.

రాఫెల్‌ ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దీనిని బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. రాహుల్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఇటీవల అరుణ్ జైట్లీ కూడా ఇటీవల మండిపడ్డారు. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతూ...నఒక్కోచోట యుద్ధవిమానాల కొనుగోలు ధర ఒక్కోలా చెబుతున్నారని, మీ ఐక్యూ కంటే దేశ ప్రజల ఐక్యూ ఎక్కువ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+