కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధిని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్యం ఎలా ఉంది అని కావేరీ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ డాక్టర్ కరుణానిధిని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. శనివారం ఉదయం రాహుల్ గాంధీ చెన్నై లోని కావేరీ ఆసుపత్రి చేరుకున్నారు.
తరువాత చికిత్స పొందుతున్న కరుణానిధిని కలిశారు. కరుణానిధి ఆరోగ్యం ఎలా ఉంది అని కావేరీ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి ఆరోగ్యం కుదటపడుతుందని, ఆయన త్వరగా కోలుకుంటారని వైద్యులు రాహుల్ గాంధీకి చెప్పారు.

త్వరలో కరుణానిధిని డిశ్చార్జ్ చేస్తామని కూడా కావేరీ ఆసుపత్రి యాజమాన్యం రాహుల్ గాంధీకి చెప్పారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ తాను హలో అంటు కరుణానిధిని పలకరించానని అన్నారు.
తరువాత కరుణానిధి కూడా స్పందించారని, ఆయన స్పందన చూస్తుంటే త్వరగా ఇంటికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వెంట కరుణానిధి కుమారుడు స్టాలిన్, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డీఎంకే నాయకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications