కాంగ్రెస్ వ‌చ్చాక‌ ఆ చ‌ట్టాలు చెత్త‌బుట్ట‌లోకే - రైతులతో రాహుల్ - ఖేతీ బచావో యాత్ర ప్రారంభం

వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ ఇటీవల కేంద్రం సవరించిన వ్యవసాయ చట్టాలను 'నల్ల చట్టాలు'గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. కొత్త చట్టాలతో రైతులు సంతోషంగా ఉన్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, సంతోషంగా ఉంటే రైతులు రోడ్లెక్కి నిరసనలు ఎందుకు చేస్తారని ఎద్దేవా చేశారు. అంతేకాదు..

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ నల్ల చట్టాలను చెత్తబుట్టలో పారేస్తామని రైతులకు రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన 'ఖేతీ బచావో యాత్ర'ను ఆదివారం పంజాబ్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా జిల్లా బద్నికలాన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.

Rahul Gandhi promises to scrap farm laws if Congress comes to power in Centre

నిజంగా వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవే అయిఉంటే, కేంద్రం కచ్చితంగా పార్లమెంటులో చర్చచేసి ఉండేదని, ఇవి తప్పుడు చట్టాలు కాబట్టే చర్చకు అవకాశం ఇవ్వకుండా హడావిడిగా బిల్లుల్ని ఆమోదించుకుందని రాహుల్ అన్నారు. క‌రోనా విస్త‌రిస్తున్న స‌మ‌యంలో వ్య‌వ‌సాయం చ‌ట్టాల‌పై మోదీ ప్ర‌భుత్వం ఎందుకు ఆత్ర‌ప‌డింద‌ని ప్రశ్నించారు. నిజానికి మోదీ సర్కారు తీసుకొచ్చిన చట్టాలు రైతులకు ఉపయోగపడకపోగా, అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రైతుల్ని బానిసలుగా చేస్తుందని చెప్పారు.

ఖేతీ బచావో యాత్రలో భాగంగా పంజాబ్ రైతులు ఢిల్లీ వరకు ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ చేయనున్నారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ.. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తో కలిసి ఆదివారం బద్నికలాన్ లో ప్రారంభించారు. అక్కణ్నుంచి జత్ పురా వరకు తొలిరోజు యాత్ర జరుగనుంది. మూడోరోజుకు యాత్ర ఢిల్లీకి చేరనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+