రాహుల్ గాంధీ ఆస్తులు తగ్గాయి, విలువ పెరిగింది
న్యూఢిల్లీ: కాంగ్రెసు ఉపాధ్యక్షుడు, సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ అస్తుల విలువ రూ.9.4 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఆయన ఆస్తులు తగ్గగా, వాటి విలువ మాత్రం పెరిగింది. గత ఐదేళ్లలో 2009 లెక్కలతో పోలిస్తే వాటి మార్కెట్ విలువ పెరిగింది.
అమేథీ లోకసభ స్థానానికి ఆయన శనివారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. దాంతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ఆయన పేర్కొన్నారు. 2009లో రాహుల్ గాంధీ ఆస్తుల విలువ 4.7 కోట్ల రూపాయలు కాగా, ఇప్పుడు వాటి విలువ 9.4 కోట్ల రూపాయలకు పెరిగింది.

గత ఐదేళ్లలో రాహుల్ గాంధీ మాల్‌లోని రెండు దుకాణాలను విక్రయించారు. హర్యానాలోని వ్యవసాయ ఆస్తులు పోయాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఫామ్‌లో మాత్రం ఆయనకు వాటా ఉంది.
ఆస్తుల ధరలు పెరగడంతో రాహుల్ గాంధీ ఆస్తుల విలువ కూడా పెరిగిందని అంటున్నారు. రాహుల్ గాంధీ శనివారంనాడు తన కుటుంబ సభ్యులందరితో ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications