Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Caste Censuses: కుల గణన చేపట్టాల్సిన టైమొచ్చిందా..!

దేశంలో కుల గణన చేయాలని డిమాండ్ ఊపందుకుంటుంది. కుల గణన చేయాలని దేశంలో పలు పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం కుల గణనపై స్పందించకపోవడంతో బిహార్ ముఖ్యమంత్రి సొంతంగా తమ రాష్ట్రంలో కుల గణన చేయించారు. కుల గణన చేపట్టడమే కాదు. వివరాలు కూడా వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కులాలవారీగా సర్వే చేపట్టాయి. తాజాగా రాహుల్ గాంధీ కూడా దేశంలో కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

కుల గణన అనేది దేశానికి ఎక్స్ రే లాంటిది. దేశంలో కుల గణన చేపడితేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.దేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఆఫీసర్లలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్లు ఉన్నారో చెప్పాలని తాను పార్లమెంట్ లో ప్రశ్నించినట్లు రాహుల్ గుర్తు చేశారు. అన్ని శాఖల్లో కలిపి కేవలం కేవలం 5 శాతం మంది మాత్రమే ఈ మూడు వర్గాలకు చెందినోళ్లు ఉన్నారని రాహుల్ గాంధీ వివరించారు.

 Rahul Gandhi said that there is a need to take caste census in the country

దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం ఉండాలని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలో పర్యటనలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైరు ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగణను ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో నవంబర్ 15వ తేదీన కులగణనను లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం కులగణన సమయంలో ఆయా కుటుంబాల వారి నుంచి సేకరించిన డేటాను భద్రపర్చడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

 Rahul Gandhi said that there is a need to take caste census in the country

బిహార్ లో చేపట్టిన కుల గణన ప్రకారం ఆ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు 63 శాతం ఉన్నారు. ఇందులో అత్యంత వెనుకబడిన వర్గాలు (ఈబీసీలు) 36 శాతం, ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీలు) 27.13 శాతం ఉన్నట్లు కుల గణన సర్వే పేర్కొంది. ఇక ఎస్సీలు 19.65 శాతం, ఎస్టీలు 1.68 శాతం, జనరల్ కేటగిరీలో 15.52 శాతం మంది ఉన్నారు. అక్కడ బీహార్‌‌‌‌లో కులాల వారీగా చూస్తే యాదవ సామాజిక వర్గం ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్లు 14.27 శాతం మంది ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+