ఆ 15మంది కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది మోడీ పాలనపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
చెన్నై : సార్వత్రిక సమరంలో నేతలు ప్రచారంలో జోరు పెంచారు. రెండో విడత పోలింగ్ జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ప్రధఆని నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. తన సన్నిహితుల కోసమే తప్ప ప్రజల కోసం ఆయన చేసిందేమీలేదని విమర్శించారు.

ఆ 15మంది కోసమే మోడీ ప్రభుత్వం
ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కృష్ణగిరిలో పర్యటించిన రాహుల్ మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లుగా మోడీ సర్కారు 15 మంది కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తదితరుల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.

ఇకపై రైతులు జైలుకెళ్లరు
బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణం తీసుకుని పారిపోయిన వారి గురించి రాహుల్ ప్రస్తావించారు. ధనవంతులు రుణాలు ఎగ్గొట్టినా జైల్లో వేయని ప్రభుత్వం.. అప్పు కట్టలేదన్న నెపంతో రైతులను జైళ్లలో పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ రైతుకు శిక్ష పడదని రాహుల్ భరోసా ఇచ్చారు.

ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పైనా రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్‌ను ఉద్దేశిస్తూ తమిళ ప్రజలను నాగ్‌పూర్ నుంచి పాలించే అవకాశం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎప్పటికీ ఇవ్వవని అన్నారు. బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేపైన నిప్పులు చెరిగిన రాహుల్.. రాష్ట్రానికి తర్వలోనే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications