వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ సంచలనం-భారత్ లో భిన్నదేశాలు సృష్టించారు-మీడియా, బీజేపీ దాచేస్తే దాగదు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కర్నాటకలో చోటు చేసుకుంటున్న ఘటనలపై స్పందిస్తూ దేశాన్ని ముక్కలు చేసేస్తున్నారంటూ ఆరెస్సెస్, బీజేపీ, మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు.

గత రెండు, మూడేళ్లలో మీడియా, సంస్ధలు, బీజేపీ నేతలు, ఆరెస్సెస్ నిజాన్ని దాచేశాయని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. క్రమంగా నిజాలు బయటికి వస్తాయన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో అదే జరిగిందన్నారు. లంకలో ఎట్టకేలకు వాస్తవం బయటపడిందన్నారు. భారత్ లోనూ అదే విధంగా జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు.

rahul gandhi sensational comments on bjp-rss-media, hidden truth comeout as india divided

ఏది విరుద్ధం ? భారత్ విడిపోతోంది, భిన్న గ్రూపులు తయారవుతున్నాయి, గతంలో ఇది ఒక్క దేశంగా ఉండేది. కానీ వారు ఒక్క దేశంలో భిన్న దేశాల్ని తయారు చేశారంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంతా పరస్పరం ద్వేషించుకుంటున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ బాధ నుంచే హింస కూడా బయటికొస్తోందన్నారు. నన్ను నమ్మకపోతే రెండు, మూడేళ్లు ఆగాలంటూ ప్రజలకు రాహుల్ సూచించారు.

తాజాగా కర్నాటకలో బీజేపీ సర్కార్ తొలుత ముస్లిం బాలికలు ధరించే హిజాబ్ పై నిషేధం విధించింది. అది కుదరకపోవడంతో బీజేపీ విద్యార్ధి సంఘాలతో పోటీగా కాషాయ కండువాలు ధరించి పోటీ నిరసనలు చేసేలా ప్రోత్సహించింది. ఆ తర్వాత మాంసం హలాల్ చేయడాన్ని తప్పుబడుతూ నిషేధాలు విధిస్తోంది. ఆ తర్వాత ముస్లింలు మసీదుల్లో ప్రార్ధన సమయాల్లో చేసే అజాన్ కు పోటీగా హనుమాన్ చాలీసాలు పాడాలని వీహెచ్పీ పిలుపునిస్తోంది. అదే సమయంలో ఢిల్లీలో దక్షిణ ఢిల్లీ మేయర్ నవరాత్రుల్లో మాంసం అమ్మకాలను నిషేధించారు. ఆయా పరిణామాలను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

English summary
congress leader rahul gandhi on today made sensational comments on bjp, rss and media over division of india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X