డీలిమిటేషన్, మహిళా బిల్లులకు మద్దతివ్వం..! తేల్చేసిన రాహుల్..!

లోక్ సభలో పాటు దేశవ్యాప్తంగా చట్ట సభల్లో సీట్ల పెంపుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు (delimitation 2026 bill)పై ఇవాళ ప్రసంగించిన విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. మహిళా కోటా బిల్లు 'కుల గణనను పక్కన పెట్టడానికే' తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. భారత సమాజంలో ఓబీసీలు, దళితులు, మైనారిటీ వర్గాలు, మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష ఎలాంటిదో అందరికీ తెలుసని, ఈ బిల్లు కుల గణనను పక్కన పెట్టడానికే తెచ్చారని విమర్శించారు.

ఇది రాజ్యాంగం కంటే మనువాదానికి ప్రాధాన్యత ఇస్తుందని రాహుల్ విమర్శించారు. ఇది మహిళల బిల్లు కాదని, దానికి మహిళా సాధికారతతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో ఆమోదించారని, ఇది మహిళల హక్కుల ముసుగులో భారతదేశ ఎన్నికల పటాన్ని మార్చే ప్రయత్నమని రాహుల్ ఆరోపించారు. పాత బిల్లును తిరిగి తీసుకొస్తే దానికి మద్దతు ఇస్తామన్నారు. ప్రస్తుత రూపంలో మహిళా బిల్లు సహా డీలిమిటేషన్ బిల్లుకు తాము మద్దతివ్వడం లేదని తేల్చిచేెప్పేశారు.

Rahul Gandhi Slams Delimitation Bill as Hissa Chori Claims Women Quota Is a Cover for Power Play

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ప్రధాని మోడీని మంత్రగాడిగా అభివర్ణిస్తూ, ఆయన ఏం చేసినా కరెక్టే అన్నట్లుగా చుట్టూ ఉన్న వారిని తయారు చేస్తున్నారంటూ రాాహుల్ వ్యాఖ్యానించారు. ఇందుకోసం తన చిన్నతనంలో మెజిషీయన్ కథను చెప్పారు. దీనిపై అధికార కూటమి సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ ఓం బిర్లా సైతం పదే పదే రాహుల్ స్పీచ్ ను అడ్డుకున్నారు. ఓ దశలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లేచి రాహుల్ గాంధీని ప్రధానిపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో రాహుల్ తన ప్రసంగం పూర్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+