Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓట్లు చోరీ చేసి గెలుస్తున్నారు.. త్వరలో అన్నీ బయటపెడతా : రాహుల్ గాంధీ

దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల సమయంలోనూ ఓట్ల చోరీ జరిగిందని త్వరలోనే ఆ వివరాలను బ్లాక్ అండ్ వైట్ విధానంలో ప్రజల ముందు ఎన్నికల కమిషన్ ముందు ఉంచుతామని అన్నారు. ఎన్నికలు చోరీ చేసి ఎన్డీఏ కూటమి గెలిచేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం తాజాగా తెలిపింది. బిహార్​ లో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు మరణించారు. 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్​ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

"ఇది కేవలం 52 మందికే కాదు. బిహార్ లో మాత్రమే ఇలా జరగడం లేదు. మహారాష్ట్రలోనూ ఇలాగే చీట్ చేసి గెలిచారు. ఓటర్ల లిస్టు బహిర్గతం చేయమని ఎలక్షన్ కమిషన్ కు విన్నవించాం. కానీ కమిషన్ పట్టించుకోలేదు. వీడియోగ్రఫీ అడిగాం. వాళ్లు చట్టాన్నే మార్చేశారు. కోటి మంది కొత్తగా మహారాష్ర్టలో ఓటర్ గా అర్హత పొందారు. అయితే ఆ రాష్ట్రంలో ఎలక్షన్ ను చోరీ చేశారు" అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ భారీగా ఓట్ల చోరీ చేశారు. ఆ విషయాలపై ఎలక్షన్ కమిషన్ తోపాటు ప్రజల ముందు ఉంచుతా. బ్లాక్ అండ్ వైట్ విధానంలో మేము ఈ చోరీని కర్ణాటకలో గుర్తించాం.. అని రాహుల్ గాంధీ తెలిపారు.

ఇప్పుడు వాళ్ల గేమ్ తమకు అర్థమైందని వాళ్లకు తెలుసు. మేము ఒక నియోజకవర్గాన్ని తీసుకుని లోతుగా విశ్లేషించాం. సమస్య ఏంటంటే వాళ్లు ఓటర్ లిస్టు ఇస్తారు. ఆ ఓటరు లిస్టును పూర్తిగా విశ్లేషించలేము. మేము ఆ లిస్టును డిజిటల్ ఫార్మాట్ లో పెట్టాము. ఆ తర్వాత మా పరిశోధనలో నిజాలు బయటకు వచ్చాయి. ఆ ఓటర్లు ఎవరు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారని గుర్తించాం. అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్ని గ్రహించి ఓటర్లను డిలీట్ చేయడం అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. భారత్ లో ఓట్లు చోరీ అవుతున్నాయి. ఇదే రియాల్టీ అని రాహుల్ గాంధీ కీలక విమర్శలు చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాతో పోస్టు చేశారు. మహారాష్ట్రలో ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందో మేము వివరించాం. కర్ణాటకలోనూ ఇదే చేశారు. కర్ణాటకలో ఓ నియోజకవర్గం తీసుకుని పూర్తిగా విశ్లేషించాం. అప్పుడు అసలు విషయం బయటపడింది. మేము చూస్తూ కూర్చోం. ప్రజల ముందుకు తీసుకొస్తాం. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Rahul Gandhi Slams Vote Rigging Promises Evidence from Karnataka Elections

బిహార్ రాష్ట్రం ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం తాజాగా తెలిపింది. బిహార్​లో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు మరణించారు. 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్​తెలిపింది. మరో 7 లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు ఈసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్లు తెలిపింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న ప్రచురించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+