ట్రంప్‌కు రాహుల్ గాంధీ ఏం చెప్పదలచుకున్నారు- లేఖలో కీలకాంశాలు
Rahul Gandhi: ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఇక ప్రమాణ స్వీకారానికి సమాయాత్తమౌతోన్నారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడాయన.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసింది. 295 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 50.70 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,32,98,740గా లెక్క తేలింది. ఈ ఎన్నికలను ట్రంప్ ఏకపక్షంగా మార్చివేశారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 47.70. మొత్తంగా 6,89,71,195 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. 2019 నాటి ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టం కట్టిన కొన్ని కీలక రాష్ట్రాలు ఈ దఫా స్వింగ్ అయ్యాయి. రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపాయి.
ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రంప్ విజన్‌పై కోట్లాదిమంది అమెరికన్లు ఎంతో విశ్వాసం ఉంచారని, దాని ఫలితంగానే అత్యంత భారీ మెజారిటీతో గెలిచారని ప్రశంసించారు.
రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు భారత్- అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సత్సంబంధాలు మరింత బలోపేతమౌతాయని తాను నమ్ముతున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ఈ రెండు దేశాలు చిత్తశుద్దితో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాయని, పరస్పర సహకారంతో సమగ్రాభివృద్ధి సాధించాలని అభిలాషిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఎన్నికల్లో ఓడిపోయిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కూ విడిగా లేఖ రాశారు రాహుల్ గాంధీ. ఈ ఎన్నికల్లో స్ఫూర్తిదాయక పోరాటం చేశారని పేర్కొన్నారు. దేశ ప్రజలను ఏకం చేసేలా, ఎలాంటి వివక్ష లేకుండా అందించిన పాలన చిరకాలం పాటు అమెరికన్లకు గుర్తుండిపోతుందన అన్నారు.












Click it and Unblock the Notifications