ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమి మ్యాచ్​ ఫిక్సింగ్, రిగ్గింగ్: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్, రిగ్గింగ్ చేసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 288 సీట్లకు గాను కూటమికి 235 సీట్లు వచ్చాయని మ్యాచ్ ఫిక్సింగ్, రిగ్గింగ్ కారణంగానే ఎన్డీఏ కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ కూటమిపై సంచలన ఆరోపణలు చేశారు. 2024లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలుపొందిందని అన్నారు. రిగ్గింగ్ కు మహారాష్ట్ర ఎలక్షన్స్ సాక్ష్యం అని విమర్శించారు. త్వరలో బిహార్ లో జరగనున్న ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే ప్లాన్ అమలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఏర్పడింది. కూటమిలో భాగంగా బేజేపీ, ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ విజయం సాధించాయి. కూటమికి 235 సీట్లు రాగా.. అందులో 132 సీట్లు కేవలం బీజేపీ మాత్రమే సాధించింది. ఈ క్రమంలో మ్యాచ్ ఫిక్సింగ్, రిగ్గింగ్ కారణంగానే మహారాష్ట్రలో కూటమి గెలిచిందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

Rahul Gandhi s Explosive Claim BJP s Maharashtra Poll Rigging to Hit Bihar Next

ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఐదు సూత్రాలను పాటించిందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మొదటిది తమకు అనుకూలమైన ఎలక్షన్ కమిషన్ ను ఏర్పాటు చేయడం కోసం ప్యానెల్ ను రిగ్గింగ్ చేయడం.. రెండోది నకిలీ ఓటర్లను లిస్టులోకి దూర్చడం మూడోది వోటింగ్ టర్న్ అవుట్ లో మార్పులు నాలుగోది బోగస్ వోటింగ్ ఐదోది సాక్ష్యాలను దాచడం.. ఈ ఐదు స్టెప్స్ తో బీజేపీ కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తోందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ ఏడాది నవంబర్ లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు ఎన్నికలు నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో వెల్లడి కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+