రాహుల్ గాంధీని అక్కడ అడుగు కూడా పెట్టనివ్వట్లేదు
ఇంఫాల్: సుమారు రెండు నెలలకు పైగా హింసాత్మక పరిస్థితులతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ నిర్వహించ తలపెట్టిన పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో కాన్వాయ్‌కు బ్రేక్ పడింది. రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్‌లో సహాయ శిబిరంలో తలదాచుకుంటోన్న వారిని పరామర్శించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
మణిపూర్ హింసలో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. వందలాది మంది అందులో ఆశ్రయం పొందుతున్నారు. వారిని పరామర్శించడానికి ఇవ్వాళ రాహుల్ గాంధీ- పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంఫాల్‌కు చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం చురచంద్‌పూర్‌కు చేరుకోవాల్సి ఉంది.

అక్కడి నుంచి బిష్ణుపూర్ జిల్లాలోని మొయిరాంగ్‌కు వెళ్లేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ రాత్రికి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు మొయిరాంగ్‌లో బస చేయాలని ముందుగా నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. చురచంద్‌పూర్‌కు మాత్రమే రాహుల్ గాంధీ వెళ్లగలిగారు.
మొయిరాంగ్‌లో రాత్రి బస చేయడానికి పోలీసులు ససేమిరా అనడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మొయిరాంగ్ పర్యటన రద్దు చేసుకున్నట్లు మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైషెమ్ మేఘచంద్ర తెలిపారు. పోలీసులు, అధికార యంత్రాంగం రాహుల్ గాంధీని మొయిరాంగ్‌కు వెళ్లడానికి అనుమతించలేదని తెలిపారు.
దీనితో చురచంద్‌పూర్‌లో మాత్రమే హింసాకాండ బాధితులను రాహుల్ గాంధీ పరామర్శించగలిగారని వివరించారు. చురచంద్‌పూర్ నుంచి రాహుల్ మళ్లీ ఇంఫాల్‌కు తిరిగి వస్తున్నారని, రాత్రి ఇక్కడే బస చేస్తారని అన్నారు. శుక్రవారం నాడు ఆయన మళ్లీ మొయిరాంగ్‌కు వెళ్తారా? లేదా? అనేది ఇంకా ఖరారు చేయాల్సి ఉందని అన్నారు. ఇంఫాల్‌కు వచ్చిన తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications