రాహుల్ గాంధీని సీక్రెట్ గా కలిసిన హార్దిక్ పటేల్!

గుజరాత్ యువనేత, పటీదార్ వర్గం నేత హార్దిక్ పటేల్ స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో రహస్యంగా చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగాలనేది హర్దిక్ పట

ఢిల్లీ: గుజరాత్ యువనేత, పటీదార్ వర్గం నేత హార్దిక్ పటేల్ స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో రహస్యంగా చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగాలనేది హర్దిక్ పటేల్ వ్యూహంగా చెబుతున్నారు.

అయితే ఎన్నికల్లో హార్దిక్ పటేల్ పోటీకి ప్రస్తుతం వయసు ఒక అడ్డంకిగా మారిందని, దీంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ కు బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

Rahul, Hardik hold ‘secret meeting’ on day OBC leader Alpesh joins Cong

రాహుల్ గాంధీనగర్ పర్యటనలో భాగంగా జరిగిన ర్యాలీలో ఓబీసీ నేత అల్పేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, అదే రోజు హార్దిక్ కూడా రాహుల్ ను కలిసినట్టు సమాచారం. అయితే తాను రాహుల్ ను కలవాలని భావిస్తే, బహిరంగంగానే కలుస్తానని, సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటి? అని హార్దిక్ నిన్న ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అహ్మదాబాద్ కు 87 కిలోమీటర్ల దూరంలోని మండల్ పట్టణానికి హార్దిక్ ముందే చేరుకున్నారని, ఆపై తన ర్యాలీలో భాగంగా అక్కడికి వచ్చిన రాహుల్ ను రాత్రి 7.30 గంటల సమయంలో కలిశారని తెలుస్తోంది.

రాహుల్ బస చేసిన హోటల్ కు హార్దిక్ వచ్చి వెళుతున్నట్టు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ లు మీడియాలో ప్రసారమవుతున్నాయి. ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన నిఖిల్ సవానీతో కలసి వచ్చిన హార్దిక్, రాహుల్ ను కలిసినట్టు తెలుస్తోంది. మరో సీసీటీవీ ఫుటేజ్ లో హార్దిక్ మాట్లాడుతూ, తాను రాహుల్ ను కలవలేదని, ఆ పార్టీ నేత అశోక్ గెహ్లాట్ ను మాత్రం కలిశానని మాట్లాడుతున్నట్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+