రాహుల్ కంటే సీనియర్లకే ప్రాధాన్యత: సోనియాపై దిగ్విజయ్ సంచలనం
న్యూఢిల్లీ: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజాస్వామ్యం తీసుకన్న నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అడ్డుకునేవారని ఆయన వ్యాఖ్యానించారు.
స్థానిక కమిటీలను, పిసిసిలను పటిష్టం చేస్తే తమ పదవులకు ముప్పు వాటిల్లుతుందని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో ఉన్న నాయకులు కొందరు స్థానిక స్థాయి నాయకత్వాలను ఎదగనీయడం లేదని అన్నారు.

రాహుల్ గాంధీ దీనిపై దృష్టిని సారించి కష్టపడే కార్యకర్తలకు మంచి పదవులు ఇవ్వాలని భావించేవారని, కానీ ఢిల్లీలో ఉండే బలమైన నేతలు ఆయన నిర్ణయాలకు అభ్యంతరం తెలిపేవారని అన్నారు. సోనియా, రాహుల్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, తరాల అంతరం కారణంగా ఒకే నిర్ణయం తీసుకోలేకపోయేవారని అన్నారు.
తరాల మధ్య భేదం కారణంగా సోనియా గాంధీ, రాహుల్ తీసుకునే నిర్ణయాలు కూడా భిన్నంగా ఉంటాయని చెప్పారు. కొడుకు రాహుల్ మాటకంటే సీనియర్ల మాటలకే సోనియా గాంధీ విలువిచ్చేవారని చెప్పారు. రాహుల్ గాంధీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సోనియా వ్యవహరించేందుకు కొందరు పార్టీ సీనియర్లు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ‘సోనియా గాంధీ చాలా ప్రజాస్వామ్య వాది. ఆమె సీనియర్ నేతలతో పలు విషయాలపై చర్చిస్తారు. ఆ సమయంలోనే సీనియర్ నేతలు ఆమెపై ప్రభావితం చూపిస్తారు' అని తెలిపారు.












Click it and Unblock the Notifications