రైల్వేలో 36 ఏళ్ల వీఐపీ సంస్కృతికి చరమగీతం, ఇళ్లలో కూడా పని చేయొద్దు

రైల్వే శాఖలో వీఐపీ కల్చర్‌కు ముగింపు పలికేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రైల్వే బోర్డు చైర్మన్, సభ్యులు జోన్ల పర్యటనకు వస్తే వారికి జనరల్ మేనేజర్లు బొకేలతో స్వాగతం,

న్యూఢిల్లీ: రైల్వే శాఖలో వీఐపీ కల్చర్‌కు ముగింపు పలికేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రైల్వే బోర్డు చైర్మన్, సభ్యులు జోన్ల పర్యటనకు వస్తే వారికి జనరల్ మేనేజర్లు బొకేలతో స్వాగతం, వీడ్కోలు చెప్పడం ప్రోటోకాల్‌గా ఉంది.

ఈ సంప్రదాయం గత 36 ఏళ్లుగా కొనసాగుతోంది. దీనిని పక్కన పెట్టాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. కాగా, ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న కొన్ని సంప్రదాయాలు, లోపాయికారీ అలవాట్లకు చెల్లుచీటీ రాస్తూ రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వరసపెట్టి ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Railways asks officials to slug it out, at home and at work

విలాసవంతమైన ప్రత్యేక రైలు పెట్టెలో ప్రయాణాలు చేసే బదులు సాధారణ ప్రయాణికులతో కలిసి స్లీపర్‌ తరగతిలోనో, లేదంటే తృతీయ శ్రేణి ఏసీలోనో ప్రయాణిస్తూ వారి కష్టనష్టాలను తెలుసుకోవాలని సీనియర్‌ అధికారుల్ని ఇటీవల ఆయన ఆదేశించారు.

తాజాగా మరిన్ని చర్యలను చేపట్టారు. ఇంట్లో, కార్యాలయంలో వీఐపీ సంస్కృతికి పూర్తిగా చరమగీతం పాడాల్సిందేనని పీయూష్ గోయల్‌ స్పష్టం చేశారు. ఈ రెండింట్లో ఎక్కడైనా పుష్పగుచ్ఛాలు, బహుమతులు స్వీకరించవద్దని చెప్పారు.

అలాగే, కిందిస్థాయి ఉద్యోగులతో సేవ చేయించుకుంటున్న సీనియర్ ఉద్యోగులు.. వెంటనే వారిని రిలీవ్ చేయాలని కూడా రైల్వే శాఖ ఆదేశించింది.

దేశవ్యాప్తంగా 30 వేలమంది ట్రాక్‌మెన్‌లు అనధికారికంగా ఇల్లలో పని చేస్తుంటారని ఓ అంచనా. వీరిలో సుమారు 7వేల మంది వరకు గత నెల రోజుల్లో ఆ పనుల నుంచి విముక్తి పొంది, విధుల్లో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+