ఛార్జీల పెంపు యోచనలో రైల్వే శాఖ
ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దీంతో రైల్వే ప్రయాణం మరింత ప్రియం కానుంది.
న్యూఢిల్లీ: ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దీంతో రైల్వే ప్రయాణం మరింత ప్రియం కానుంది. భద్రతపరమైన అంశాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఆర్థిక శాఖ విముఖత చూడంతో.. ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను వడ్డించేందుకు రైల్వే సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రూ.1.19లక్షల కోట్ల నిధులను భద్రతాపరమైన చర్యల కోసం కేటాయించాలని ఆర్థికశాఖకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఇటీవల లేఖ రాశారు. అయితే ఆర్థికశాఖ అందులో 25శాతం మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది.

మిగతా మొత్తం(75శాతం) సొంతంగా సమకూర్చుకోవాలని రైల్వేను కోరింది. ఈ నేపథ్యంలో టిక్కెట్లపై ప్రత్యేకంగా భద్రత పన్ను వేసి నిధులు రాబట్టుకోవాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే త్వరలోనే రైలు ప్రయాణికులపై ఆ మేరకు భారపడనుంది. కాగా, రైలు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ మొత్తాన్ని రైల్వే శాఖ వినియోగించనుంది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications