శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు ఎసరు పెట్టిన వందే భారత్?
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవ్వాళ ఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో తనిఖీ చేశారు. ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ ను తీసుకున్నారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య ఇక మరింత పెరగనుంది. ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో వాటిని మరింత విస్తరించనుంది. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తోన్న ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 10 రైళ్లు పట్టాలెక్కాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది.

శతాబ్ది, రాజధాని స్థానంలో..
ఈ డిమాండ్ కాస్త- శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ లకు ఎసరు పెట్టేలా పరిణమించింది. ఈ రెండు సర్వీసుల స్థానంలో వందే భారత్ ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. శతాబ్ది, రాజధానిలను పక్కనపెట్టి వాటికి బదులుగా వందే భారత్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చే దిశగా చర్యలు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. వందే భారత్ కొత్త కోచ్ లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత దశలవారీగా శతాబ్ది, రాజధానిలను రద్దు చేస్తారని తెలుస్తోంది.

శతాబ్దిని తనిఖీ చేసిన రైల్వే మంత్రి
ఈ పరిణామాల మధ్య రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఇవ్వాళ న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను తనిఖీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శతాబ్దిలో అందుతోన్న సౌకర్యాలు, సేవల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. ట్రాక్‌లో మార్పులు చేయడం ద్వారా రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ-జైపూర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.

రైల్వే మంత్రిపై ప్రశంసలు..
అత్యాధునికమైన వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినందుకు పలువురు ప్రయాణికులు అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రైళ్లను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. రైళ్లల్లో మహిళలకు భద్రతను మరింత మెరుగుపర్చాల్సి ఉంటుందని, నైట్ పెట్రోలింగ్ పెంచాలని చెప్పారు. రైళ్లను సమయానుగుణంగా నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
24 సర్వీసులు..
ప్రస్తుతం దేశంలో 24 రాజధాని ఎక్స్ ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 1969-70 రైల్వే బడ్జెట్ లో తొలిసారిగా దీన్ని ప్రకటించారు. తొలి రైలు ఢిల్లీ-హౌరా మధ్య అందుబాటులోకి తీసుకొచ్చారు. 1969 మార్చి 1న మొదటి రాజధాని ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ నుంచి హౌరాకు మధ్య రాకపోకలు సాగించింది. ఏపీ, తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ మధ్య 24 సర్వీసులు రాకపోకలు సాగిస్తోన్నాయి. 1988లో శతాబ్ది ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కింది. 21 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications