వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.30 వేల కోట్ల టెండర్లు రద్దు చేసిన కేంద్రం.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

భారతీయ రైల్వే ప్రైవేట్‌ ట్రైన్ నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రైవేట్‌ రైళ్ల నిర్వహణపై రూ.30వేల కోట్ల టెండర్లు నిర్వహించి.. వాటిని కేంద్ర రైల్వే శాఖ రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ నిర్వహించిన టెండర్లలో ప్రైవేట్ రైలు సర్వీసుల్ని అందించేందుకు జీఎంఆర్‌హైవే లిమిటెడ్‌, ఐఆర్‌ సీటీసీ, ఐఆర్బీ ఇన్ఫ్రా, క్యూబ్‌ ఐవే, సీఏఎఫ్‌ ఇండియా, మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు పలు కంపెనీలు పోటీ పడ్డాయి.

 railways terminates rs 30000 cr private passenger train bid

ఐఆర్‌సీటీసీ, మేఘా ఇంజనీరింగ్‌ టెండర్లపై చర్చలు జరుపుతున్నట్లు,మిగిలిన కంపెనీల టెండర్లను రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. మళ్లీ కొత్త కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించగా.. టెండర్లను కేంద్రం ఎందుకు రిజెక్ట్‌ చేసిందనే అంశంపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిపుణుడు మనీష్ అగర్వాల్ స్పందించారు. సామాన్యుడిపై భారం తగ్గించేందుకు కేంద్రం టెండర్లను తక్కువ ధరకే పాడేలా ప్రైవేట్‌ సంస్థలపై ఒత్తిడి తెస‍్తుందని అన్నారు. రైల్వేశాఖ న్యాయమైన నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పంద నిబద్ధత ఉండాలి' అని అగర్వాల్ తెలిపారు.

గతేడాది జులైలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇలా చెప్పారు. ఇండియన్‌ రైల్వే ప్రైవేట్‌ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉందని, మొదటి దశలో 2023 నాటికి 12 ప్రైవేట్ రైళ్ల సర్వీసుల్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 151 ప్రైవేట్ రైలు సర్వీసులు 2027 నాటికి మొత్తం దశలవారీగా దేశంలోని 109 రూట్లల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తాయన్నారు. ఇందుకోసం మొత్తం రూ.30,000 కోట్ల ప్రైవేట్ సంస్థల్ని టెండర్ల కోసం ఆహ్వనించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

English summary
railways terminates rs 30000 cr private passenger train bid process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X