Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వశీకరణం చేసి..పెళ్లయిన 11వ రోజు.. అమావాస్య అర్ధరాత్రి నరబలి..? మృతుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

మేఘాలయ కపుల్స్ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో నిందితులైన సోనమ్ సహా మరో నలుగురు నిందితులను సిట్ పోలీసులు షిల్లాంగ్ లోని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఐదుగురికి 8 రోజుల పోలీసు కస్టడీ విధించింది షిల్లాంగ్ కోర్టు. మరోవైపు తమ కుమారుడు రాజా రఘువంశీ మరణంపై అతడి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడ్ని అంతా కావాలనే చంపారని ఆరోపించారు.

మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా రాజా రఘువంశీ తల్లి తమ కుమారుడి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనమ్ రఘువంశీ.. తమ కుమారుడ్ని నరబలి ఇచ్చిందని విమర్శలు చేసింది. సోనమ్ కు జాతక దోషం ఉందని.. అందుకే తమ కుమారుడు రాజా రఘువంశీని నరబలి ఇచ్చిందని పేర్కొంది. తన కుమారుడిని చేతబడి చేసి కిరాతకంగా బలి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది.

Raja Raghuvanshi Murder Mother Accuses Sonam of Bewitching Sacrificing Son on 11th Day

"సోనమ్ రఘువంశీకి జాతక దోషం ఉంది. అందువల్ల నా కుమారుడిని బలి ఇవ్వాలని ప్లాన్ వేశారు. జాతక దోషం పోతే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకోవాలని సోనమ్ అనుకుంది. అందుకే నా కొడుకుని నరబలి ఇచ్చారు. నా కుమారుడి మృతిపై మాకు న్యాయం జరగాలి. ఈ దారుణానికి పాల్పడ్డవారిని వదిలిపెట్టొద్దు. నా కొడుకు ఏం తప్పు చేశాడు. అతడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది" అని రాజా రఘువంశీ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

సోనమ్ తన కుమారుడిని వశీకరణం చేసి లొంగదీసుకుందని.. చేతబడి చేసిందని ఆరోపించింది. ఇలాంటి ఘటనలు విన్నాం కానీ ఇప్పుడే కళ్లారా చూస్తున్నామని పేర్కొంది. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ అసోంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి సోనమ్.. రాజాను నెక్ లేస్ వేసుకోమని బలవంతం చేసేదని తెలిపింది. తన కుమారుడిని నరబలి ఇస్తే అన్ని దోషాలు పోతాయని సోనమ్ భావించిందని రాజా రఘువంశీ తల్లి పేర్కొంది.

ఇక సోనమ్ రఘువంశీ, రాజా రఘువంశీల పెళ్లి మే 11న జరిగింది. మే 20న ఈ జంట మేఘాలయకు వచ్చింది. యితే చివరిసారిగా వీళ్లు మే 23న కనిపించారు. ఆ తర్వాత ఏమైపోయారో తెలియదు. దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే జూన్ 3న రాజా రఘువంశీ మృతదేహాన్ని చిరపుంజీ వద్ద ఓ లోయలో పోలీసులు గుర్తించారు.అయితే రాజా మృతదేహం లభ్యం కావడంతో సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. సోనమ్‌ తో పాటు మధ్యప్రదేశ్‌ కు చెందిన మరో ముగ్గురి కిల్లర్స్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+