వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60 ఏళ్ల వృద్దురాలిపై 19 ఏళ్ల యువకుడి అఘాయిత్యం... చంపి,శవంతో కామవాంఛ తీర్చుకున్న ఉన్మాది...

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్‌లో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్దురాలిని హత్య చేసిన 19 ఏళ్ల యువకుడు ఆమె శవంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మొదట ఆ వృద్దురాలి ఇంట్లోకి చొరబడ్డ అతను ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆ వృద్దురాలు గట్టిగా ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడు.అనంతరం ఆమె శవంతో కామవాంఛ తీర్చుకున్నాడు. వృద్దురాలిపై హత్య,అత్యాచారానికి పాల్పడిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం..

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా గంగా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బుధవారం(సెప్టెంబర్ 15) ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యాచార సమయంలో ఆ తతంగాన్ని నిందితులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.బాధిత బాలిక ప్రస్తుతం పదో తరగతి చదవుతోంది. రైసెన్ జిల్లాకు చెందిన ఆమె.. ఇటీవల తన సోదరి జబ్బు పడటంతో ఆమెకు సహాయంగా ఉండేందుకు భోపాల్ జిల్లాలోని గంగా పట్టణానికి వచ్చింది. బుధవారం(సెప్టెంబర్ 15) ఆమె సోదరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భోపాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉండటంతో... స్థానిక యువకులు ముగ్గురు ఆమెపై కన్నేశారు. ఇంట్లోకి చొరబడి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలు టాప్...

మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలు టాప్...

నేషనల్ క్రైమ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం... మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,ఢిల్లీ,రాజస్తాన్,టాప్‌లో ఉన్నాయి. గతేడాది రాజస్తాన్‌లో 34,535,ఉత్తరప్రదేశ్‌లో 49,385,పశ్చిమ బెంగాల్‌లో 36,439 కేసులు నమోదయ్యాయి. అత్యాచార కేసుల్లో రాజస్తాన్ 5310 కేసులతో టాప్‌లో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో 2769 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉంది.మైనర్ బాలికలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్‌ టాప్‌లో ఉంది.గతేడాది మధ్యప్రదేశ్‌లో 3259 మంది మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైనట్లుగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2785,ఉత్తరప్రదేశ్‌లో 2630 కేసులు నమోదయ్యాయి.

Recommended Video

AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu
ఢిల్లీలోనే మహిళలపై నేరాలు ఎక్కువ...

ఢిల్లీలోనే మహిళలపై నేరాలు ఎక్కువ...

మెట్రో నగరాల్లో మహిళలపై నేరాల్లో ఢిల్లీ టాప్‌లో ఉంది. గతేడాది ఢిల్లీలో మహిళలపై నేరాలకు సంబంధించి 9782 కేసులు నమోదయ్యాయి. ఇందులో 967 రేప్ కేసులు ఉన్నాయి. 2018లో 11,724,2019లో 12,902 కేసులు నమోదవగా.. గతేడాది ఆ సంఖ్య కొంతమేర తగ్గడం గమనార్హం. అయినప్పటికీ మహిళా భద్రత విషయంలో ఢిల్లీ అట్టడుగున ఉన్నది. సీనియర్ సిటిజెన్లపై నేరాల విషయంలోనూ ఢిల్లీ టాప్‌లో ఉన్నది. ఇక దేశవ్యాప్తంగా మత కలహాలకు సంబంధించి గతేడాది 857 కేసులు నమోదయ్యాయి.ఇందులో ఒక్క ఢిల్లీలోనే 520 కేసులు నమోదవగా...బిహార్‌లో 117 కేసులు,హర్యానా,జార్ఖండ్‌లలో 51 కేసులు,మహారాష్ట్రలో 26,గుజరాత్ 23 కేసులు నమోదయ్యాయి. గతేడాది కులాలకు సంబంధించిన గొడవల్లో మొత్తం 736 కేసులు నమోదయ్యాయి. ఇందులో బిహార్‌లో 208,మహారాష్ట్రలో 125,యూపీలో 116,కర్ణాటకలో 95,తమిళనాడులో 69 కేసులు నమోదయ్యాయి. ఊపా(అసాంఘీక కార్యకలాపాల చట్టం) కింద జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా 287 కేసులు నమోదవగా,మణిపూర్‌లో 169,జార్ఖండ్‌లో 86,అసోంలో 76,యూపీలో 72 కేసులు నమోదయ్యాయి.

English summary
A 19-year-old man who murdered a 60-year-old woman was raped her dead body. He first entered into the old woman's house and tried to rape her. He murdered her after she resisted,then he raped her dead body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X