90 అడుగుల బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. మృత్యుంజయుడయ్యాడు
జైపూర్: బోరుబావులను నరకలోకానికి ముఖద్వారంగా భావిస్తుంటారు. అందులో పడ్డ పిల్లల సురక్షితంగా తిరిగొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్కసారి బోరుబావిలో పడితే..తల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిలిస్తూ, ఇక తిరిగి రాని లోకానికి వెళ్తారని చెబుతుంటారు. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటన- దీన్ని తిరగరాసింది. 95 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన ఓ నాలుగేళ్ల బాలుడు సురక్షితంగా తిరిగొచ్చాడు. మృత్యుజంయుడయ్యాడు. ఆ బాలుడిని కాపాడటానికి 16 గంటల పాటు సహాయక సిబ్బంది పడిన శ్రమ వృధా కాలేదు.
రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల లచ్ఛ్రీలో నివసించే అనిల్ దేవాసీ అనే నాలుగేళ్ల బాలుడు- నీరు పడక వదిలేసిన బోరు బావిలో పడ్డాడు. గురువారం సాయంత్రం తండ్రి నగర్ దేవాసీతో కలిసి సొంత పొలానికి వెళ్లిన అతను.. ఆడుకుంటూ పొరపాటున బోరుబావిలో పడిపోయాడు. రెండురోజుల కిందటే ఆ బోరు వేయించాడు నగర్ దేవాసీ. నీరు పడకపోవడంతో దాన్ని అలాగే వదిలివేశాడు. బోరుబావిని మూసివేశాడు. ఆడుకుంటూ దానిపై మూతను తొలగించిన అనిల్ అందులో పడిపోయాడు.

తన కుమారుడు బోరుబావిలో పడ్డ విషయం తెలిసిన వెంటనే నగర్ దేవాసీ సంచోర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఆచార్య, సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ భూపేంద్ర కుమార్ యాదవ్ సారథ్యంలో జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది, స్థానిక పోలీసులు నిరాంతరాయంగా సహాయక చర్యలను చేపట్టారు.
Recommended Video
అజ్మీర్‌తో పాటు గుజరాత్‌లోని గాంధీనగర్, వడోదర నుంచి సహాయక సిబ్బందిని పిలిపించారు. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి. 90 అడుగుల లోతులో అనిల్ దేవాసీ చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. నిరంతరాయంగా ఆక్సిజన్‌ను పంపించారు. క్రమంగా తప్పకుండా ఆహారాన్ని అందిస్తూ వచ్చారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వారు. 90 అడుగుల మేర గొయ్యిని యుద్ధ ప్రాతిపదికన తవ్వారు. అనిల్‌ను సురక్షితంగా కాపాడారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య సహాయాన్ని అందించారు. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.












Click it and Unblock the Notifications