రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు : టూవీలర్‌పై వచ్చి ఓటేసిన బిజెపి ఎంపీ...
నేడు రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల పోలింగ్‌కు రాజస్థాన్‌లోని ఓ బిజెపి ఎంపీ టూవీలపై వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిల్వారాలో బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన భార్యతో కలిసి టూవీలర్‌పై పోలింగ్ బూత్‌కు రావడం జరిగింది. యాక్టివా వాహనంపై ఆయన సాదాసీదాగా పోలింగ్ బూత్‌కు రావడం కాస్త చర్చనీయాంశమైంది.
ఇవాళ రాజస్థాన్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో199 సీట్ల కోసం పోలింగ్ సాగుతోంది. మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 స్థానాలకు ఒకే విడతలో నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగుతోంది. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మృతిచెందడంతో ఆ స్థానంలో జరిగే పోలింగ్ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని అన్ని స్థానాల్లో బిజెపి అభ్యర్థులను బరిలోకి దించిది. ఇక, కాంగ్రెస్ పార్టీ భరత్‌పూర్ స్థానాన్ని మిత్రపక్షమైన లోక్‌దల్‌కి కేటాయించడం జరిగింది.

యాక్టివాపై వచ్చి ఓటువేసిన ఎంపీ : ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైంది. తొలి రెండుగంటల్లోనే చాలామంది ప్రముఖులు ఓటు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే బిల్వారాలో బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా తన భార్యతో కలిసి యాక్టివాపై వచ్చి మరీ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయన ఎంతో సాదాసీదాగా పోలింగ్ బూత్‌కు రావడం చర్చనీయాంశమైంది.
#WATCH | Rajasthan Elections | BJP MP Subhash Chandra Baheria and his wife Ranjana Baheria arrived at a polling booth in Bhilwara on a two-wheeler to cast their votes. pic.twitter.com/9Qj793x6vl
— ANI (@ANI) November 25, 2023
ఇంకా ప్రముఖుల్లో మాజీ సీఎం వసుంధర రాజే కూడా జలావర్‌లో తన ఓటు వేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వాడుకోవాలని ఈ సందర్భంగా ఆమె ఓటర్లని కోరారు. తొలిసారిగా ఓటు వేసేవారు తప్పకుండా తమ ఓటును వినియోగించుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా తన ఓటును జైపూర్‌లో వేశారు. ఇక, జోద్‌పూర్‌లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.












Click it and Unblock the Notifications