ఎమ్మెస్సీ చదివిన భర్త వద్దు.. వెయిటర్ ప్రియుడే ముద్దు.. నవవధువు దారుణం!

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఓ దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మూడు ముళ్ల బంధం, ఏడడుగుల సాక్షిగా చేసుకున్న బాసలు.. మూడు నెలలు కూడా గడవకముందే రక్తపు మడుగులో ముగిశాయి. బాగా చదువుకున్న భర్త, గౌరవప్రదమైన కుటుంబం, 50 ఏళ్ల బంధుత్వం.. ఇవేవీ ఆ నవవధువును ఆపలేకపోయాయి. కేవలం ఓ వెయిటర్ కోసం, తన పాత ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య. ప్రమాదం అంటూ ఆమె ఆడిన హైడ్రామాను ఛేదించిన పోలీసులు, అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే ఈ 'హనీమూన్ మర్డర్' వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు మీకోసం..

అసలేం జరిగిందంటే?
సాదుల్‌షహర్‌కు చెందిన 23 ఏళ్ల అంజలికి, శ్రీ గంగానగర్‌కు చెందిన ఆశిష్ (27)తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆశిష్ భూగర్భ శాస్త్రంలో ఎమ్మెస్సీ (M.Sc Geology) పూర్తి చేసి, బీఈడీ చదువుతున్నాడు. వీరిద్దరి కుటుంబాల మధ్య 50 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆశిష్ అంజలికి వరుస అవుతాడు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. జనవరి 30 సాయంత్రం ఆశిష్ తన భార్య అంజలి, మరికొంత మంది బంధువులతో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. అందరూ తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అంజలి మొండికేసి ఆశిష్‌ను ఓ నిర్మానుష్యమైన దారిలోకి తీసుకెళ్లింది. అక్కడ పొదల్లో మాటువేసిన అంజలి ప్రియుడు సంజు, అతని ఇద్దరు స్నేహితులు ఆశిష్‌పై దాడి చేశారు. సంజు తన స్నేహితులతో కలిసి ఆశిష్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత అది హిట్ అండ్ రన్ (రోడ్డు ప్రమాదం) లాగా కనిపించేలా నాటకమాడారు. తన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని, తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని అంజలి నమ్మబలికింది.

Rajasthan Honeymoon Murder Woman Kills M Sc Husband for Waiter Lover Family Demands Death Penalty

పోలీసుల విచారణలో తేలిన నిజం
ఆశిష్ మృతదేహంపై ఉన్న గాయాలు రోడ్డు ప్రమాదంలో జరిగిన వాటిలా లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంజలిని విచారించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. కాల్ డేటా, లోతైన దర్యాప్తులో అంజలికి పాత ప్రియుడు సంజుతో సంబంధం ఉన్నట్లు తేలింది. సంజు పెళ్లిళ్లలో వెయిటర్‌గా పని చేస్తాడు. బాగా చదువుకున్న ఆశిష్ కంటే చదువు లేని వెయిటర్ సంజు వైపే అంజలి మొగ్గు చూపింది.

కన్నకూతురికే ఉరిశిక్ష వేయాలంటున్న కుటుంబం
ఈ ఘటనతో అటు అత్తగారి ఇల్లు, ఇటు పుట్టిల్లు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అంజలి బాబాయ్ మాట్లాడుతూ.. "మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. మా వంశం గౌరవాన్ని మంటగలిపింది. మా అల్లుడు అనుభవించిన నరకాన్ని చూస్తే, అంజలికి కూడా ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నాం" అని కన్నీరుమున్నీరయ్యారు. ఆశిష్ తల్లిదండ్రులు కూడా ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+