విద్యార్థినిపై స్కూల్ డైరెక్టర్, టీచర్ సామూహిక అత్యాచారం, బలవంతంగా అబార్షన్..

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజస్థాన్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వక్ర బుద్ధితో ప్రవర్తిస్తే విద్యార్థులకు ఇక దిక్కెవరు? క్రమశిక్షణ నేర్పించాల్సిన వారే క్రమశిక్షణ తప్పి అఘాయిత్యానికి పాల్పడితే పర్యవసానం ఏమిటి?

రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ప్లస్ టూ చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన డైరెక్టర్, టీచర్ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని సికార్ దగ్గర్లో ఉన్న అజీట్‌ఘర్ లో జరిగింది.

Rajasthan minor repeatedly gangraped in school by the school owner and teacher

పాఠశాలకు చెందిన డైరెక్టర్, టీచర్ కొన్ని నెలలుగా ఆ విద్యార్థినిని లోబ‌రుచుకుని ఆమెపై సామూహిక అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బాలిక గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారు.

అయితే.. అబార్షన్ అనంతరం బాలికకు తీవ్ర రక్తస్రావం అవడంతో అసలు విషయం బయటికొచ్చింది. ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా, ఆ బాలిక జరిగినదంతా చెప్పుకొచ్చింది.

దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే ఆమెను జైపూర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ జగదీశ్, టీచర్ జగత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లు పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A minor girl from Rajasthan’s Sikar was allegedly gang-raped by the school owner and a teacher. The 12th standard student was studying in Janta Bal Niketan School in Ajeetgarh area and according to reports, the school’s owner Jagdish and a teacher, Jagat Singh, had been sexually abusing the girl for a few months. The incident came to light when the girl got pregnant and the duo tried to get fetus aborted at a hospital in a nearby town. The girl returned home and started bleeding heavily, the alarmed parents rushed her to a hospital in Ajeetgarh where the doctors informed her parents about the rape and abortion. The minor’s condition is critical and she has been shifted to hospital in Jaipur.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి