మిస్ ఇండియా వరల్డ్ -2019 విజేతగా రాజస్థాన్ ముద్దుగుమ్మ
ముంబై: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన అందాల భామ సుమన్ రావు విజేతగా నిలిచారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచారు సుమన్ రావు. ఇక చత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2019వ టైటిల్‌ను సాధించారు. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019 విజేతగా బీహార్‌కు చెందిన ముద్దుగుమ్మ శ్రేయా శంకర్ నిలిచారు.

కాలేజీ విద్యార్థిణి అయిన 20 ఏళ్ల సుమన్ రావు థాయ్‌లాండ్‌లో జరగబోయే మిస్ వరల్డ్ 2019 పోటీల్లో భారత్ నుంచి పాల్గొననుంది. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాన్ని సాధించేందుకు శరీరంలోని ప్రతి నరము. అణువు ఇష్టంతో కష్టపడుతుందని తద్వారా విజయం వరిస్తుందని షో తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ రావు చెప్పారు.

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రేమో డీసౌజా, ప్రముఖ నటి హ్యూమా ఖురేషీ, చింత్రాగధ సింగ్, ఫ్యాషన్ డిజైనర్ ఫాల్గుణి షేన్ పీకాక్, భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ చెత్రీలు వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్, విక్కీ కౌషల్, మౌనీ రాయ్‌లు తమ డ్యాన్స్ స్టెప్పులతో వీక్షకులను అలరించారు. కార్యక్రమంకు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, నటుడు మనీష్‌పాల్‌లు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications