కమల్ పార్టీపై రజనీకాంత్ స్పందన, మనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన పని లేదు

చెన్నై: రాజకీయాల్లో కమల్ హాసన్ తొలి అడుగుపై రజనీకాంత్ స్పందించారు. రెండు రోజుల క్రితం కమల్ మధురైలో భారీ సభ ఏర్పాటు చేసి తన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సభను తాను చూశానని, చాలా బాగా జరిగిందని ప్రశంసించారు.

తమ దారులు వేరు అని, లక్ష్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. ఆయన చెన్నైలో తన నివాసంలో మాట్లాడారు. అతను సమర్థుడైన నాయకుడు అన్నారు.

Rajinikanth Praises Kamal Haasan, Calls Him 'Efficient'

రజనీకాంత్ శుక్రవారం తన అభిమానులతోను భేటీ అయ్యారు. మనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. క్రమశిక్షణే మన బలమని చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని చెప్పారు.

త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటిస్తానని రజనీకాంత్ చెప్పారు. కొత్త పార్టీ పెట్టి తమిళనాడులోని 234 స్థానాలకు పోటీ చేస్తానని గతంలో రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+