అభినందించుకున్న మోడీ, బాబు: జగన్ పార్టీలో నిస్తేజం
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులు శుక్రవారం పరస్పరం అభినందించుకున్నారు. దేశవ్యాప్తంగా మోడీ హవా కారణంగా బిజెపి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకు పోతోంది. అదే విధంగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ఎన్డీయే 320 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేవలం 71 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

ఈ నేపథ్యంలో బాబు, మోడీలు ఫోన్ చేసుకున్నారు. పరస్పరం అభినందించుకున్నారు. కాబోయే ప్రధాని, కాబోయే సిఎం అంటూ ఒకరికి ఒకరు అభినందలు తెలిపినట్లుగా తెలుస్తోంది. ఎన్డీయే గెలుపు పట్ల చంద్రబాబు, టిడిపి గెలుపు పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 14 లోకసభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 8, భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. తెలంగాణలో తెరాస 12, బిజెపి, కాంగ్రెసు రెండేసి చోట్ల, టిడిపి ఒకచోట ఆధిక్యంలో ఉంది. కాగా, సీమాంధ్రలో ఆశించిన ఫలితాలు కనిపించక పోవడంతో జగన్ పార్టీలో నిస్తేజం కనిపిస్తుండగా, టిడిపి కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications