Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భవిష్యత్తు యుద్ధాలు ఇవే.. సిద్ధంగా భారత్ : రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్

ఆత్మ నిర్భరత అనేది దేశ భద్రతలో భాగమేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత అనేది కేవలం సైన్యం చేతిలో మాత్రమే లేదని దేశ ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాలని అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, టెక్నికల్, మానవ రహిత వైమానిక వాహనాలు, శాటిలైట్ ఆధారిత నిఘా విభాగాలు లాంటి వాటిని యుద్ధ ఆయుధాలుగా వినియోగిస్తారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్ అంబేద్కర్ నగర్ లోని ఆర్మీ వార్ కాలేజీలో త్రివిధ దళాలు నిర్వహించిన సమావేశానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

" అత్యాధునిక యుద్ధాలు కేవలం భూమి, ఆకాశం, నీటిలోనే జరగవు. అవి అంతరిక్షం, సైబర్ స్పేస్ వరకు వ్యాపిస్తాయి. శాటిలైట్ సిస్టమ్స్, యాంటీ- శాటిలైట్ ఆయుధాలు, స్పేస్ కమాండ్ సెంటర్లే ఇప్పుడు అత్యంత శక్తివంతమైనవి. మనం కేవలం రక్షణ పరంగా సిద్ధం కావడం మాత్రమే కాదు. వ్యూహాత్మకంగానూ వ్యవహరించాలి. భవిష్యత్తులో యుద్ధాలు టెక్నాలజీ, ఇంటెలిజెన్స్, ఎకానమీ, డిప్లోమసీ అనుసంధానంగా జరుగుతాయి. ప్రస్తుతం ఎక్కువ మంది సైన్యం, యుద్ధ పరికరాలు అధికంగా ఉండటం ముఖ్యం కాదు. సైబర్ వార్ ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్ మానెడ్ ఏరియల్ వెహికల్స్, శాటిలైట్ బేసెడ్ సర్వీలెన్స్ ఇప్పుడు విజయంలో ప్రధానంగా ఉన్నాయి" అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సింధూర్‌ సమయంలోనే భారత్ తన శక్తిని ప్రపంచ దేశాలకు చూపించిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ అన్నారు. అత్యాధునిక యుద్ధ టెక్నాలజీతోనే ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించామని తెలిపారు. ఉగ్రవాదులు మనం చేసే దాడులు పసిగట్టే అవకాశం లేకుండానే వాళ్లపై దాడి చేసి దెబ్బకొట్టామని.. ఈ ఆపరేషనే సాంకేతిక ఆధారిత యుద్ధానికి చక్కటి ఉదాహరణగా తెలిపారు. రోజురోజుకు ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయని.. వాటికి తగ్గట్లుగా భారత్ బలగాలను సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శక్తిబాన్ రెజిమెంట్, దివ్యాస్త్ర బ్యాటరీ, రుద్ర, డ్రోన్ ప్లాటూన్‌ లాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు ఆర్మీ చొరవ తీసుకుంటోందని తెలిపారు.

Rajnath Singh Cyber Warfare Drones and Satellites to Replace Traditional Weapons

మరోవైపు తాజాగా భారత నౌకా సంపత్తిలో మరో రెండు యుద్ధ నౌకలు చేరాయి. ప్రాజెక్ట్ 17- ఏలో భాగంగా ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి యుద్ధ నౌకలను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంఛనంగా ప్రవేశపెట్టారు. వీటిని పూర్తి స్థాయిలో దేశీయ సాంకేతికతతో రూపొందించారు. బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లడమే కాకుండా అత్యున్నత స్థాయి ఆయుధాలను గుర్తించే సెన్సార్​లు ఉండటం ఈ నౌక ప్రత్యేకతగా అధికారులు వెల్లడించారు. ఈ యుద్ధ నౌకల వివరాలను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+