అవసరమైతే మళ్లీ పాక్ సరిహద్దు దాటుతాం: రాజ్‌నాథ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉగ్రవాది హఫీజ్ సయీద్ వంటి వారికి రాజకీయ చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన హఫీజ్‌ను పాక్ అందలమెక్కిస్తోందని విమర్శించారు. భారత భద్రతా బలగాలు అవసరమైతే మళ్లీ పాక్ సరిహద్దులు దాటుతాయని హెచ్చరించారు.

కాశ్మీర్ ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని భావిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని చెప్పారు. పాక్‌తో భారత్ స్నేహం కోరుకుంటోందని, కానీ అందుకు విరుద్దంగా ఆ దేశం వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు.
న్యూస్ 18 రైజింగ్ ఇండియా సదస్సులో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. జమ్ము కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెప్పారు. కాశ్మీర్ పైన తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోరుకుంటోందన్నారు.
దీనిపై మాట్లాడేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్‌ను ప్రభుత్వం నియమించిందని, ఎవరితో అయినా మాట్లాడేందుకు ఆయన సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications