Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనా సరిహద్దుల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్: అనూహ్య పరిస్థితులు

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ, సరిహద్దు పొడవునా తరచూ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోంది చైనా. లఢక్ మొదలుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇదే తరహా వాతావరణం కనిపిస్తుంటుంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు- భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తుండటం దీనికంతటికీ కారణం.

గతంలో అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో భారత్-చైనా సరిహద్దుల వద్ద గ్రామాలకు గ్రామాలను సైతం నిర్మించింది చైనా. దీనిపై భారత్ అనేకసార్లు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ.. పట్టించుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తమదేశ భూభాగంగా చూపించిన మ్యాప్‌లను సైతం మొన్నీ మధ్యే విడుదల చేసింది కూడా.

 Rajnath Singh interacts with Army personnel Bum La of Arunachal Pradesh

ఈ పరిస్థితుల్లో- రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. భారత- చైనా సరిహద్దులకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఉదయం బమ్ లా పాస్‌కు వెళ్లారాయన. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా- చైనాలోని సోనా కంట్రీని అనుసంధానించే మార్గం ఇది. భారత్- చైనా సరిహద్దు విషయంలో అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతంగా భావిస్తుంటారు ఈ ప్రాంతాన్ని.

బమ్ లా పాస్‌కు వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్ సరిహద్దు భద్రత జవాన్లను కలిశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తవాంగ్ వార్ మెమొరియల్‌ను సందర్శించారు. 1962 నాటి సినో- ఇండియన్ యుద్ధంలో అమరుడైన సుబేదార్ జోగిందర్ సింగ్ విగ్రహానికి నివాళి అర్పించారు. దసరా పండగ వేడుకలను బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి జరుపుకొన్నారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. నాలుగు సంవత్సరాల కిందట బమ్ లా పాస్‌ను సందర్శించానని గుర్తు చేసుకున్నారు రాజ్‌నాథ్ సింగ్. విజయదశమిని పండగను మరోసారి జవాన్లతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దులను కాపాడే బాధ్యతను మీరు భుజానకెత్తుకున్న జవాన్లే అసలైన హీరోలని ప్రశంసించారు.

సంక్లిష్ట వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల్లో సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లతో విజయదశమి పండగను జరుపుకోవడం అదృష్టంగా భావిస్తోన్నానని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు వారిని చూసి గర్వపడుతున్నారని అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశ ప్రతిష్ఠ రెట్టింపైందని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడం వల్లే ఇది సాధ్యపడిందని కితాబిచ్చారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+