పాక్ కు పగిలిపోయే వార్నింగ్: పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి!

పాకిస్తాన్ బరితెగింపుకు, నోటి దురుసుకు.. పగిలిపోయే వార్నింగ్ ఇచ్చింది భారత్. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ ఇటీవల భారత్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ తన పరిమితుల్లో ఉండాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. "బెంగాల్‌పై కన్నేస్తే, ఈసారి పాకిస్థాన్ ఎన్ని భాగాలుగా విడిపోతుందో ఆ దేవుడికే తెలియాలి" అంటూ రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు.

పాకిస్థాన్ గత చరిత్రను రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుమారు 55 ఏళ్ల క్రితం (1971లో) పాకిస్థాన్ దుశ్చర్యల వల్ల ఆ దేశం రెండు ముక్కలై, బంగ్లాదేశ్ ఏర్పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పుడు అనుభవించిన పరాభవాన్ని మర్చిపోవద్దని, మళ్లీ అలాంటి సాహసానికి ఒడిగడితే పాకిస్థాన్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ జోలికి వస్తే ప్రతీకారంగా కోల్‌కతాపై దాడి చేస్తామన్న ఖావాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు.

Rajnath Singh Warns Pakistan Only God Knows How Many Parts You Will Break Into If You Cast Eye On Bengal

కేంద్రంపై టీఎంసీ విమర్శల వర్షం..

మరోవైపు, ఈ అంశం దేశీయ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. పాకిస్థాన్ బెదిరింపులపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మౌనంగా ఉన్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. బెంగాల్ ప్రజల ప్రాణాలంటే కేంద్రానికి లెక్కలేదా అని ఆయన ప్రశ్నించారు. "56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని కేవలం ఎన్నికల ప్రచారంలోనే బిజీగా ఉన్నారా? కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ బహిరంగంగా హెచ్చరిస్తున్నా స్పందించడానికి వీరికి ధైర్యం లేదా?" అని ఆయన నిలదీశారు.

పీఓకేను స్వాధీనం చేసుకోండి..

కేంద్ర నాయకత్వానికి నిజంగా ధైర్యం ఉంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను (PoK) తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యానికి, బీఎస్ఎఫ్ (BSF) కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు. "రాజ్‌నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు.. మీరు నిజంగా ధైర్యవంతులైతే పీఓకేపై చర్యలు తీసుకోండి" అంటూ ఆయన సూటిగా సవాల్ విసిరారు.

మొత్తానికి, పాకిస్థాన్ వ్యాఖ్యలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా, పశ్చిమ బెంగాల్ వేదికగా కేంద్ర ప్రభుత్వం మరియు విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+