• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా టెన్షన్: కేంద్రం తొలి అధికారిక స్పందన - ఉభయసభల్లో సుమోటోగా రాజ్‌నాథ్ - డ్రాగన్ నిఘాపై ఇలా..

|

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గత నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారీగా మోహరించిన చైనా సైన్యాలు తరచూ భారత బలగాలను కవ్వించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో జూన్ 15న హింసాత్మక ఘర్షణలో మన జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇటీవల కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. సైనిక, దౌత్యమార్గాల్లో జరిపిన అన్ని చర్చలు దాదాపు విఫలమయ్యాయి. చైనాను డీల్ చేయడంలో మోదీ సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు, మన వీవీఐపీలపై డ్రాగన్ నిఘా వేసిందన్న వ్యవహారంపైనా కేంద్రం స్పందించింది.

  India-China Stand Off : China విషయమై Parliament సమావేశాల్లో కీలక ప్రకటన చేయనున్న రక్షణ మంత్రి!!

  బీహార్ భగీరరథుడు లాంగి భూయాన్-ఒక్కడే 30 ఏళ్లు చమటోడ్చి,ఊరికి కాలువ-పిరమిడ్ కన్నా గొప్పది

  తొలి అధికారిక స్పందన..

  తొలి అధికారిక స్పందన..

  ఎల్ఏసీ వెంబడి తూర్పు లదాక్ లో చైనాతో కొనసాగుతోన్న విభేదాలపై మోదీ సర్కార్ తొలిసారి అధికారిక స్పందన వెలువరించేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండోరోజైన మంగళవారమే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉభయ సభల్లోనూ కీలక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఆ ప్రకటన ఏ సమయంలో చెస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చైనాతో గొడవలకు సంబంధించి ఇప్పటిదాకా సైనిక, విదేశాంగ శాఖల ప్రతినిధులు మాత్రమే ప్రకటలు చేస్తూరాగా.. రక్షణ మంత్రి చేయబోయేది ప్రభుత్వం నుంచి వెలువడే తొలి అధికారిక ప్రకటనకానుంది.

  చైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదు

  సుమోటోగా రాజ్‌నాథ్ ప్రకటన..

  సుమోటోగా రాజ్‌నాథ్ ప్రకటన..

  నిజానికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘చైనా సరిహద్దు' అంశంపై చర్చించబోమని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. సరిహద్దులో పరిస్థితులు.. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు సంబంధించిన వ్యూహాత్మక అంశాలు కావడంతో వాటిని బహిరంగంగా చర్చించడం సబబు కాదని వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఉభయ సభల షెడ్యూల్ లోనూ ‘చైనా'అంశాలను చేర్చలేదు. అయితే, దేశ సమగ్రతకు సబంధించిన కీలక అంశం కాబట్టే సరిహద్దులో ఏం జరుగుతున్నదో ప్రజలకు కేంద్రం వివరించాల్సిందేనని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. టెక్నికల్ గా ఈ అంశంపై విపక్షాలు ప్రశ్నించలేని స్థితిలో.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సుమోటోగా ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  డ్రాగన్ నిఘాపై కేంద్రం ఇలా..

  డ్రాగన్ నిఘాపై కేంద్రం ఇలా..

  భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మొదలుకొని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, సైనికాధికారులు, ఇతర వీవీఐపీలతోపాటు టాప్ క్రిమినల్స్ పైనా చైనా గూఢచర్యానికి పాల్పడిందంటూ ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రచురించిన కథనం సంచలనం రేపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే డ్రాగన్ నిఘాకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం. దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెంటనే స్పందించాయి. ‘‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.. దొంగదారిలో డ్రాగన్ చేస్తోన్న దురాగతాల గురించి భారత ప్రభుత్వానికి ముందే తెలుసు. ఓపెన్ సోర్స్ లో ఉన్న నేతల సమాచారాన్ని వాళ్లు సేకరిస్తున్నట్లు ఇదివరకే గుర్తించాం''అని ఉన్నతాధికారులు వివరించారు.

  అందుకే చైనా యాప్స్‌పై నిషేధం..

  అందుకే చైనా యాప్స్‌పై నిషేధం..

  చైనాకు చెందిన షఎన్ జెన్, ఝెన్హువా అనే ఐటీ కంపెనీలు.. ‘ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటా బేస్' పేరుతో ‘హైబ్రీడ్ వార్ ఫేర్' నిర్వహిస్తున్నాయని, అందులో భాగంగా భారత్ లోని ప్రముఖులు సహా దాదాపు 10వేల మందిపై నిఘా కొనసాగిస్తున్నదని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్' పేర్కొంది. ఈ విషయం ముందే తెలుసన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. భారత్ లో చైనా యాప్స్ నిషేధానికి ఇది కూడా ఓ కారణమేనని తెలిపారు. ‘‘ఇలాంటి చట్ట వ్యతిరేక కలాపాలకు పాల్పడుతుననాయనే చైనా యాప్‌లను నిషేధించాం. ప్రధాని మోదీ లాంటి వీఐపీలకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని తీసుకుని.. భారత వ్యతిరేక కార్యకలాపాలకు శత్రు దేశాలు వాడుకుంటాయి'' అని కేంద్ర అధికారులు తెలిపారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత, వరుసగా చర్చలు ఫలించకపోవడం, కొత్తగా నిఘా వ్యవహారం బయట పడిన దరిమిలా పార్లమెంట్ ఉభయ సభల్లో రాజ్ నాథ్ ప్రకటనకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.

  English summary
  Defence Minister Rajnath Singh is likely to issue a suo moto statement in both houses of Parliament on Tuesday. this will be the Government of India's first official statement over the ongoing India-China military standoff along the LAC in eastern Ladakh. Govt Says 'Not Surprised' by China Snooping on VIPs Amid Border Row, Admits Data Could be Misused
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X