ఉగ్ర ఘాతుకం: బాంబు దాడిలో ఐదుగురు సైనికులు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. మరో జవానుకు తీవ్రగాయాలయ్యాయి. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవేట కొనసాగిస్తున్న సమయంలో దొంగచాటుగా ఉగ్రవాదులు దాడి చేశారు.

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడులకు పాల్పడటంతో ఐదుగురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, విజిబిలిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న ఉగ్రవాదులు.. సైనికులు వెళుతున్న ట్రక్కుపై గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు.

police-

కాగా, ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు కాండి ఫారెస్ట్‌లోని ఓ గుహలో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి ఆర్మీకి సమాచారం అందింది. దీంతో గురువారం నుంచి సైనికులు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉగ్రవాదుల జాడ గుర్తించడంతో.. ఇరువైపులా కాల్పులు జరిగాయి. అక్కడ్నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు.

ఈ బాంబు దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉధంపూర్‌లోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే దాక్కుని ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజౌరి జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఉగ్రవాదుల కోసం సైనికులు వేట కొనసాగిస్తున్నారు.

కాగా, గురువారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఎకె 47 రైఫిల్, ఒక పిస్టల్‌తో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు స్థానికులు, నిషేధిత ఉగ్రవాద సంస్థ LeTకి చెందినవారు. వారిని షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ సేగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+