కర్తవ్య పథ్‌గా రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్స్: మోడీ ప్రసంగంతో చర్యలు
న్యూఢిల్లీ: రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్‌లను కర్తవ్య మార్గంగా మార్చే లక్ష్యంతో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డిఎంసి) సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మొత్తం రహదారి, ప్రాంతాన్ని కర్తవ్యాపత్ అని పిలుస్తామని వారు తెలిపారు.

సెప్టెంబర్ 8న ప్రారంభించనున్న ప్రధాని మోడీ
తన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు మొత్తం స్ట్రెచ్‌ను సెప్టెంబర్ 8 సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

మోడీ ప్రసంగం నేపథ్యంలోనే పేర్ల మార్పు
ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రసంగిస్తూ.. వలసవాద మనస్తత్వానికి సంబంధించిన చిహ్నాలను తొలగించడంపై ప్రధాని మోడీ ఉద్ఘాటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేర్ల మార్పు చేస్తుండటం గమనార్హం.
ప్రజల కోసం సుందరంగా ముస్తాబైన సెంట్రల్ విస్టా లాన్స్
సెంట్రల్ విస్టా అవెన్యూలో రాజ్‌పథ్‌లో రాష్ట్రాల వారీగా ఫుడ్ స్టాల్స్, చుట్టూ పచ్చదనంతో కూడిన రెడ్ గ్రానైట్ వాక్‌వేలు, వెండింగ్ జోన్‌లు, పార్కింగ్ స్థలాలు, రౌండ్-ది క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది. ఇండియా గేట్‌కు సమీపంలో రెండు బ్లాక్‌లు ఉంటాయని, ఒక్కో బ్లాక్‌లో ఎనిమిది దుకాణాలు ఉంటాయని, కొన్ని రాష్ట్రాలు తమ ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.












Click it and Unblock the Notifications