Rajya Sabha: అటు ఛైర్మన్ పై అభిశంసన-ఇటు రాజ్యాంగంపై చర్చ..!
పార్లమెంట్ సమావేశాల్లో ఉభయసభల్లో రాజ్యాంగంపై చర్చ చేపట్టాలని నిర్ణయించినా ఇప్పటివరకూ లోక్ సభలో మాత్రమే ఈ చర్చ జరిగింది. రాజ్యసభలో అదానీ వివాదంపై విపక్షాల రచ్చ నేపథ్యంలో రాజ్యాంగ చర్చ జరగలేదు. అయితే అదే సమయంలో విపక్షాలు రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ విపక్షాలపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన అభిశంసనకు సిద్ధమయ్యాయి.
అయితే ఓవైపు విపక్షాల అభిశంసన నోటీసు పెండింగ్ లో ఉన్న సమయంలో రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ఇవాళ రాజ్యాంగంపై చర్చ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. దీంతో విపక్షాలు ఏ మేరకు ఆయనకు సహకరిస్తాయన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే లోక్ సభలో జరిగిన రాజ్యాంగ చర్చలో విపక్షాలు సజావుగానే పాల్గొన్నాయి. అయితే పెద్దల సభ అయిన రాజ్యసభలో మాత్రం పరిస్ధితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

రాజ్యసభలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు రాజ్యాంగంలో చర్చ జరుగుతుందని బులిటెన్ లో పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఈ చర్చ ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ మాట్లాడతారు. రేపు చర్చ ముగిశాక చివర్లో ప్రధాని మోడీ సమాధానం చెప్తారు. అయితే ఇందులో లోక్ సభ తరహాలోనే ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. దీంతో బీజేపీ కూడా అస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. అయితే ఈ చర్చలో రాజ్యసభ ఛైర్మన్ పై అభిశంసనపైనా విపక్షాలు ప్రశ్నించే అవకాశముంది.












Click it and Unblock the Notifications