వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాబినెట్‌లో రాథోడ్‌కు దక్కని బెర్త్, ఈ సారి మరో బాధ్యత ? కారణమిదేనా ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మోడీ 2.0 క్యాబినెట్‌లో చోటు దక్కకున్న ఏం నిరాశ పడలేదు మాజీ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. తనపై నమ్మకం ఉంచి తొలి క్యాబినెట్‌లో బెర్త్ అందించిన మోడీ-షా ద్వయానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కానీ ఇసుమంతైనా అసమ్మతి స్వరం వినిపించలేదు. పైగా తనతోపాటు కలిసి పనిచేసిన పెద్దల పేర్లను ప్రస్తావిస్తూ గ్రేట్ హనట్ అంటూ ట్వీట్ చేశారు రాథోడ్.

రాథోడ్‌కు లేని చోటు
మోడీ 2.0 క్యాబినెట్ 58 మందితో గురువారం కొలువుదీరింది. అయితే ఈసారి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు ప్రాతినిధ్యం దక్కలేదు. అయినా తానేమీ మదనపడలేదు. మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేశారు. మోడీ సహా మంత్రులందరికీ అభినందనలు తెలియజేశాడు. తనకు మంత్రి పదవీ ఎందుకు దక్కలేదో అని నెటిజన్లు ప్రశ్నించగా సున్నితంగా తిరస్కరించారు. మోడీపై తనకున్న వల్లమాలిన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. మోడీ ముందుచూపు, శక్తి, ఖచ్చితత్తంతో పనిచేయడం దేశానికి గొప్ప అవకాశమని కీర్తించారు.

Rajyavardhan Rathore, Left Out Of Cabinet, Says Thank You In Tweets

అలాగే గత క్యాబినెట్‌లో పనిచేసిన సీనియర్లను గుర్తుచేశారు. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ,స్మృతి ఇరానీలతో కలిసి పనిచేయడం తనకు లభించిన గొప్ప అవకాశమని కొనియాడారు. గత మోడీ క్యాబినెట్‌లో రాజ్యవర్థన్ సింగ్ రాథఓడ్ సమాచార, ప్రసారాల శాఖ ఇంచార్జీ మంత్రిగా, యువజన క్రీడ శాఖల మంత్రిగా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇదీ కారణం ..
రాథోడ్‌ను క్యాబినెట్ నుంచి తప్పించడంలో బీజేపీ పెద్దలు పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. తనను ప్రభుత్వంలో కాకుండా .. పార్టీపరంగా సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాజస్థాన్‌ బీజేపీ నేతల్లో లుకలుకలు పీక్‌ స్టేజీకి చేరడంతో .. వారందరినీ సముదాయించి, ఎకతాటిపైకి తీసుకొచ్చేందుకే మంత్రివర్గంలో తీసుకోలేదనే ఊహాగానాలు వినిపిస్తు్నానయి. 2018లో రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 73 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 100 సీట్లు సాధించి అధికారం చేపట్టింది. కానీ 2013లో మాత్రం 89 సీట్లను బీజేపీ సాధించింది. అంటే ఐదేళ్లలో బీజేపీ 16 సీట్లను కోల్పోయి .. అధికారానికి దూరమైంది.

దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అలాగే గజేంద్రసింగ్ షేకావత్ నేతృత్వంలో కలిసి పనిచేయాలని కోరడం కూడా ఆ పార్టీ కొంపముంచింది. ఈ ప్రతిపాదనను అప్పటి సీఎం వసుంధర రాజే కూడా తిరస్కరించారు. దీంతో రాజస్థాన్ బీజేపీలో జవసత్వాలు నింపేందుకు రాథోడ్ ను రంగంలోకి దింపాలని కమలదళం భావిస్తోంది. అందుకోసమే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాజస్థాన్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే .. మరో ఐదేళ్లలో పార్టీకి మెజార్టీ స్థానాలు అప్పగిస్తారని భావిస్తోంది. తొలివిడత కేంద్రంలో మంత్రి పదవీ చేపట్టినందున .. రెండో విడతలో పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
The day after BJP leader Rajyavardhan Singh Rathore became one of the more high-profile exclusions from Prime Minister Narendra Modi's new cabinet of ministers, he posted a series of messages on Twitter praising the Prime Minister for his "vision, energy and c
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X