ఇక్కడ భర్తకు భార్య రాఖీ కడుతుంది.. ఈ వింత ఆచారానికి కారణం అదే..?
రక్షాబంధన్.. హిందువుల ప్రాచీన పండుగ. రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లకు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమకు గుర్తుగా భావిస్తారు. ఈ పండుగ రోజు రాఖీ కట్టి గిఫ్టులు ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాఖీ.. అన్నాచెల్లెల ప్రేమ, నమ్మకం, భద్రత, అత్యంత పవిత్రమైన బంధానికి ప్రతీకగా హిందువులు జరుపుకునే పండగగా ప్రసిద్ధి చెందింది. ఈ పండగకు ఇంకా కేవలం మూడు రోజులే ఉండడంతో తమ బ్రదర్స్ కు రాఖీలు కొనేందుకు అక్కాచెల్లెళ్లు షాపింగ్ మొదలు పెట్టారు. అయితే రాఖీ పండుగ అనగానే అన్నకు చెల్లి కడుతుందని మనకు తెలుసు. కానీ రాఖీని భార్య.. భర్తకు కట్టవచ్చా..? ఇందుకు పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసా..? మనదేశంలో భర్తకు భార్య రాఖీ కట్టే సాంప్రదాయం ఎక్కడ నిర్వహిస్తారో తెలుసా..?
మధ్యప్రదేశ్ రాష్ట్రం చింద్వాడ జిల్లాలోని గోండు గిరిజనులు రక్షాబంధన్ ను వినూత్నంగా జరుపుకుంటారు. సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ రాఖీ పండుగ ఉంటుంది. ఇక్కడి గిరిజన ప్రజల్లోని సోదరీమణులు తమ సోదరులకు కాకుండా భర్తలకు మాత్రమే రాఖీ కడతారు. ఈ ఆచారం మరెక్కడా కనిపించదు. రాఖీ అంటే ఒకరికి ఒకరు రక్షగా ఉండడం అని ఈ గిరిజనలు భావిస్తారు. అలా ఒకరికి ఒకరు భార్య భర్తలు కలిసి ఉండాలని ఉద్దేశంతో అలా జరుపుకుంటారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

అంతేకాక రాఖీ పండుగ రోజున ఈ గోండు గిరిజనులు తమ పొలాల్లోకి వెళ్లి సంతోషంగా ఈ పండుగను నిర్వహిస్తారు.రక్షాబంధన్ రోజున పొలాల్లోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి పంటలకు కూడా రాఖీ కడతారు. అలాగే అక్కడే అడవుల్లోని చెట్లకు కూడా రాఖీ కట్టి ప్రేమను చాటుతారు. ఇలాంటి సంప్రదాయాన్ని అక్కడి గిరిజనులు వందల ఏళ్ల నుంచి పాటిస్తూ వస్తున్నారు. ఇలాంటి అరుదైన సంప్రదాయం మనకు దేశంలో ఇంకెక్కడా కనిపించదు.












Click it and Unblock the Notifications