మినీ మాల్దీవులుగా సోమశిల, క్రూయిజ్ విహారం.. తెలంగాణా టూరిజం నయా ప్లాన్!
తెలంగాణ రాష్ట్రంలో టూరిజం శాఖ పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మరింత మెరుగుగా తీర్చిదిద్ది పర్యాటకంగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని ఆర్జించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా నల్లమల అడవుల అటవీ ప్రాంతంలోని ద్వీపంలా ఉండే ఓ ప్రాంతాన్ని మాల్దీవుల తరహాలో అభివృద్ధి చేయనుంది.
అందమైన ద్వీపంలా సోమశిల
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం లోని సోమశిల ను ఇప్పటికే తెలంగాణ మినీ మాల్దీవులు గా పిలుస్తారు. నిజంగానే కృష్ణానది ఒడ్డున, నల్లమల అడవుల మధ్య ఉన్న ఈ ప్రాంతం ద్వీపంలా నాలుగువైపులా నీళ్లతో, లాగూన్లు, బ్యాక్ వాటర్ తో నిండి ఉండడంతో చూడడానికి సుందరమైన పర్యాటక ప్రాంతంలో కనిపిస్తుంది .

సోమశిలను మినీ మాల్దీవులుగా అభివృద్ధి
అయితే తెలంగాణా పర్యాటక శాఖ 13.75 కోట్లతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిలను మాల్దీవులుగా అభివృద్ధి చేయనుంది. ఐదున్నర కోట్ల రూపాయలతో సోమశిల నుండి మినీ మాల్దీవులుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికను రూపొందించింది.
5న్నర కోట్ల రూపాయలతో సోమశిల అభివృద్ధి
ఇందులో భాగంగా హై స్పీడ్ జెట్ స్కీయింగ్ కు కోటి రూపాయలు, ఎకో ఫ్రెండ్లీ వసతికి కోటి రూపాయలు, సన్ సెట్ బోటింగ్ కు 1.50 కోట్ల రూపాయలు, ట్రైల్స్, ఏటీవీ రూట్స్, వ్యూ పాయింట్లకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. మాల్దీవుల స్టైల్ వాటర్ ఫ్రంట్ కాటేజీలు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్స్, పిల్లల ఆటస్థలం వంటి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం రూపు దిద్దుకుంటుంది.
పర్యాటక శాఖ తీసుకున్న మంచి నిర్ణయం
అక్కడినుండి శ్రీశైలం వరకు బోటింగ్, టైగర్ సఫారీలకు కూడా దగ్గరగా ఉండడంతో దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధను పెడుతున్నారు. సోమశిల ప్రాంతంలో 15 శివాలయాలు ఉండడంతో ఆధ్యాత్మికంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. గతంలో జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక అవార్డు అందుకున్న ప్రదేశం ఆయన సోమశిలను మినీ మాల్దీవులు గా అభివృద్ధి చేయడం పర్యాటక శాఖ తీసుకున్న మంచి నిర్ణయం.
వీకెండ్ ట్రిప్ లు, హనీమూన్ లకు బెస్ట్ ప్లేస్
నేషనల్ హైవే 65 మార్గంలో మూడు నాలుగు గంటల లోనే హైదరాబాద్ నుండి సోమశిల కు ప్రయాణం చేయవచ్చు. తక్కువ బడ్జెట్లో వీకెండ్ ట్రిప్ కు, హనీమూన్ లకు వెళ్లడానికి ఈ పర్యాటక ప్రాంతం మినీ మాల్దీవులు గా అభివృద్ధి చెందితే చాలా బాగుంటుంది.












Click it and Unblock the Notifications