ధర్మేంద్ర ప్రధాన్ పై నిర్ణయం సిద్దం - ఇక తప్పలేదు..!?

కాక్రోచ్ పార్టీ తగ్గేదే లేదంటోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోంది. కేంద్రం చర్చలు చేస్తున్నా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం వద్దే ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఇదే సమయంలో కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో ఈ రోజు కేంద్రం మరోసారి చర్చలకు సిద్దమైంది. కాగా, మంత్రి రాజీనామా పై కేంద్ర స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రాజీనామా చేస్తేనే నిరసనలు ఆగుతాయని తేల్చి చెబుతున్నారు. దీంతో.. కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ పై అనూహ్య నిర్ణయానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. చర్చల వేళ ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

నీట్ పేపర్ లీక్.. తదనంతర పరిణామాల పై ఢిల్లీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. కాక్రోచ్ పార్టీ .. విద్యార్ధులు ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సహా.. ఇండి కూటమి పార్టీలు విద్యార్ధులకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో.. కేంద్రం పైన ఒత్తిడి పెరిగింది. ప్రధాని మోదీ స్వయంగా రెండు సార్లు వీడియో సందేశం ద్వారా తమ ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చే ప్రాధాన్యత తీసుకునే చర్యల గురించి వివరించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
Dharmendra Pradhan Faces Possible Portfolio Change Amid Student Protests Here s the Full Story

పరీక్ష పత్రాలు లీక్ జరిగితే బాధ్యులకు కఠిన శిక్షలకు వీలుగా బిల్లును కేంద్రం ఆమోదించింది. అదే విధంగా ఎన్టీఏలో భారీ ప్రక్షాళన చేపట్టారు. మోదీ తమ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్ కు కట్టుబడి ఉందని సందేశం ఇచ్చారు. కాక్రోచ్ పార్టీ తొలి విడత చర్చల్లో ప్రస్తావించిన డిమాండ్లలో రెండింటికి కేంద్రం ఆమోదం తెలిపింది. కీలకమైనది.. మూడోది అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన ఈ రోజు వెల్లడిస్తామని తెలిపింది.

ఈ రోజు మరోసారి కేంద్రం- కాక్రోచ్ పార్టీ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం పైనే చర్చ జరగనుంది. ఒత్తిడి పెరుగుతున్న వేళ కేంద్రం కొత్త ప్రతిపాదనతో సిద్దమైనట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యా శాఖ నుంచి తప్పించేలా కొత్త ప్రతిపాదన కాక్రోచ్ పార్టీ ప్రతినిధుల ముందు ఉంచనుంది. విద్యాశాఖ మరొకరికి అప్పగిస్తూ నిర్ణయానికి సిద్దమైందని సమాచారం. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ ను పూర్తగా కేబినెట్ నుంచి తప్పించాలనేది విద్యార్ధుల డిమాండ్.

ధర్మేంద్ర ప్రధాన్ పై మారుతున్న ఆలోచన, కీలక పరిణామాలు-నేడే..!?
ధర్మేంద్ర ప్రధాన్ పై మారుతున్న ఆలోచన, కీలక పరిణామాలు-నేడే..!?

నీట్ పరీక్ష లీక్ తో ఇప్పటి వరకు కేంద్రం తీసుకున్న అన్ని చర్యలను వివరిస్తూనే... ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యా శాఖ నుంచి తప్పించనున్నట్లు వెల్లడించేలా కార్యాచరణ సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే ఇదే అంశం పై రాహుల్ స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను శాఖ మార్పు కాదని.. మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసారు. దీంతో, కేంద్రం తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు ప్రతిపాదన.. చర్చల వేళ ప్రతి స్పందన.. తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+