శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు అయ్యేది ఇక్కడే..!!

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. కొత్త సంవత్సరం జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.

ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది.

Ram Janmabhoomi Teerth Kshetra Trust shared an photos of sanctum sanctorum of Ram Mandir

తాజాగా- అయోధ్య సూర్యస్తంభాన్ని నిర్మించారు. అయోధ్యలోని ధర్మపథ్ మార్గంలో దీన్ని నెలకొల్పారు. దీని ఎత్తు సుమారు 20 అడుగులు. పైభాగంలో సూర్యుడి ప్రతిబింబాన్ని అమర్చారు. స్తంభంపై జై శ్రీరామ్ అనే అక్షరాలను హిందీలో ముద్రించారు. హనుమంతుడు, గద, ఇతర రామాయణ ఘట్టాలను దీనిపై చిత్రీకరించారు.

సూర్యస్తంభం ఏర్పాటు పనులను అయోధ్య జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ధర్మపథ్ ప్రారంభ పాయింట్‌లో సూర్యస్తంభాన్ని నెలకొల్పామని, ఇక ముగింపు పాయింట్‌లో త్వరలోనే దీన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. అయోధ్యలో ఇదొక చారిత్రక ఘట్టంగా మారుతుందని వ్యాఖ్యానించారు.

కాగా- రామాలయం గర్భగుడి ఫొటోలు విడుదల అయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గర్భాలయ ఫొటోలు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12:45 నిమిషాలకు గర్భాలయ పీఠంపై రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తామని పేర్ొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+